2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైయస్ జగన్ గెలవడం జరిగింది. దాదాపు 151 సీట్లను కొల్లగొట్టిన వైయస్ జగన్ కి గోదావరి జిల్లాల్లో కూడా భారీ స్థాయిలో ఓట్లు పడటం అటు టీడీపీకి మరియు జనసేన కి దిమ్మతిరిగిపోయే నట్లయింది. వాస్తవంగా చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాలో ఉండే కాపులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేవారు. ఇక బీసీల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ కి కేరాఫ్ అడ్రస్ గా ఓటు బ్యాంకు ఉండేది. ఇలాంటి తరుణంలో 2014 ఎన్నికలలో బీసీలు మరియు కాపులు ఏకధాటిగా గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలు టీడీపీకి గట్టిగా ఓట్లు వేయడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది.

 

కాగా ఆ తర్వాత కాపు రిజర్వేషన్ అంశంలో చంద్రబాబు అనేక కుయుక్తులు, వ్యూహాలు వేయడంతో బీసీలలో అభద్రతా భావం పెరగటంతో గత సార్వత్రిక ఎన్నికలలో కాపులు ప్లస్ బీసీ సామాజిక వర్గాలు గంప గుర్తుగా జగన్ కి ఓటు వేశారు. అందువల్ల ఆ స్థాయిలో భారీ మెజార్టీ రావడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఏపీలో రాజకీయ ముఖచిత్రం బట్టిచూస్తే కాపులు మరియు బీసీలు ఎక్కువగా జగన్ నాయకత్వాన్ని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల లోపు మళ్లీ తమ ఓటు బ్యాంకు తమ దగ్గర ఉండాలని బీసీలను ఆకర్షించే విధంగా చంద్రబాబు, ఇక పూర్తిగా జనసేన పార్టీ కాపు లకు అండగా ఉండే విధంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ సరికొత్త రాజకీయ ఎత్తుగడలతో మధ్య లో జగన్ ని ఇరికించాలని చూస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.

 

అందువల్ల ఇటీవల వైయస్సార్ కాపు కార్పొరేషన్ ప్రకటించిన తరుణంలో జగన్ నిధులు ఇచ్చిన సందర్భంలో… కాపు రిజర్వేషన్ గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడాన్ని మేధావులు అంటున్నారు. అయితే ఈ క్రమంలో మొదటి లో పవన్ కళ్యాణ్ తాను కాపుల మనిషిని కాదు, అందరి వాడిని భారతీయుడిని అవసరమైతే రెల్లి కుల సభ్యుడిని అంటూ భారీ ఎత్తున డైలాగులు వేశారు. ఇప్పుడు ఒక్కసారిగా కాపుల కులస్తులను ఆకర్షించుకోవడానికి పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడిన కాపులు అంతగా పవన్ ట్రాప్ లో పడే పరిస్థితి లేదని మేధావులు చెప్పుకొస్తున్నారు.

 

ఎందుకంటే గతంలో కాపు రిజర్వేషన్ గురించి నిష్పాక్షికంగా పోరాడిన ముద్రగడ ఉద్యమం చేసిన సమయంలో చంద్రబాబు నాయకత్వాన్ని సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్.. కాబట్టి పవన్ కళ్యాణ్ కాపులను ఓన్  చేసుకోవాలని ప్రయత్నించిన అది పెద్దగా కుదిరేపని కాదని మేధావులు అంటున్నారు. ఇదే టైమ్ లో బీసీల విషయానికొస్తే… చాలావరకు బీసీలకు కులాల వారీగా జగన్ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా భారీస్థాయిలో డబ్బులు కేటాయించడంతో… ఎక్కువ లబ్ధి జగన్ ప్రభుత్వంలోని బీసీలు ప్రస్తుతం పొందటంతో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ వేసే ఎత్తుగడలకు కాపులు మరియు బీసీలు పడే ప్రసక్తి ఉండదని తెలుపుతున్నారు. రాజకీయం కాబట్టి వచ్చే ఎన్నికల ముందు లోపు ఏదైనా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే విధంగా నిర్ణయం వస్తే గాని ఈ రెండు వర్గాల ప్రజలు అధికార పార్టీపై ఉన్న దృష్టి డైవర్ట్ అవటం కష్టమని చెప్పుకొస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: