2014 ఎన్నికల టైంలో బీజేపీ హైకమాండ్ ప్రధాని అభ్యర్థిగా మోడీ ని ప్రకటించిన సమయంలో వెంటనే మోడీ తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దింపారు. డిజిటల్ మీడియా తరహాలో ప్రశాంత్ కిషోర్ టీం మోడీకి దేశవ్యాప్తంగా భయంకరమైన ఫాలోయింగ్ వచ్చేలా అనేక వ్యూహాలు వేసి అత్యధిక మెజార్టీతో మోడీ గెలవటం లో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రధాని అయ్యాక మోడీ ప్రశాంత్ కిషోర్ ని పక్కన పెట్టడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ మాత్రం దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల విషయాలలో ఆయా పార్టీలకు వ్యూహకర్తగా ఉంటూ చాలావరకు బీజేపీని దెబ్బ కొట్టడం జరిగింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం వెనుక ప్రశాంత్ కిషోర్ టీం తెర వెనకాల సహాయం చేసినట్లు కూడా వార్తలు రావడం జరిగాయి. ఇదిలాఉండగా ప్రశాంత్ కిశోర్ సొంత రాష్ట్రం బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు నితీష్ కుమార్ తో మిత్రపక్షంగా వ్యవహరించినా ప్రశాంతి కిషోర్ ఇటీవల దూరమవడం జరిగింది.

 

నితీష్ కుమార్ పార్టీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సోషల్ మీడియా ద్వారా భారీ స్థాయిలో ప్రచారం చేస్తూ పార్టీ అభ్యర్థులను సరిగ్గా ఆ నియోజక వర్గాల ప్రజల ఆలోచనల మేరకు ఎంపిక చేయటం పీకే టీం చేసేది. ప్రస్తుతం జెడియు పార్టీ నుండి బయటకు వచ్చేసి బీహార్ ఎన్నికల విషయంలో ప్రశాంత్ కిషోర్ సైడ్ అయిపోవడంతో ఈ ఎన్నికలను మోడీ చాలా సీరియస్ గా తీసుకున్నారు.

 

ఇటీవల జరిగిన ఎన్నికలలో వరుసగా బీజేపీ ఓటమి చెందడంతో బీహార్ లో బీజేపీ జండా ఎగరాలని సోషల్ మీడియా వింగ్ సరికొత్త ది ఏర్పాటు చేసి భారీ స్థాయిలో డిజిటల్ ప్రచారాన్ని నిర్వహించడానికి మోడీ డిసైడ్ అయ్యారట. వైరస్ కారణంగా ఇదివరకు లాగా జనాలు ఒకే చోట ఉండే పరిస్థితి లేకపోవడంతో సోషల్ మీడియా వింగ్ లో వేల సంఖ్యలో ఉద్యోగులను రాష్ట్ర బీజేపీ నేతలు తీసుకున్నారట. దేశవ్యాప్తంగా కరోనా టైములో ఇంకా కొన్ని విషయాల్లో మోడీ సర్కార్ చేసిన పనులను విస్తృతంగా బీహార్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని మోడీ అండ్ కో డిసైడ్ అయినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: