వైయస్ జగన్ పరిపాలన ఏడాదిలోనే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కూడా అనేకమంది ప్రశంసించడం జరిగింది. చాలా వరకు జగన్ తీసుకున్న నిర్ణయాలు విని ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు తమ రాష్ట్రంలో అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా కరోనా కట్టడి విషయంలో వైయస్ జగన్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంటే ఎక్కువ టెస్టులు చేస్తూ చాలా వరకు వైరస్ రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా చేస్తున్న నేపథ్యంలో జగన్ ముందుచూపు ఉన్న సీఎం అని పొగుడుతున్నారు. కేంద్ర పెద్దలు మరియు ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఇటీవల తెలపడం జరిగింది.

 

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి కూడా జగన్ పాలన పై శభాష్ అనే విధంగా కామెంట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో సిఎం కేసీఆర్ ఫెయిల్ అయ్యారని కానీ పక్క రాష్ట్రంలో ఉన్న జగన్ సక్సెస్ అయినట్లు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం జగన్ అమలు చేస్తున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి అని, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పేదలను దృష్టిలో పెట్టుకుని కరోనా వైరస్ పరీక్షలు ఉచితంగా చేస్తూ కరోనాను ఆరోగ్య శ్రీలో జగన్ చేర్పించడం చాలా గ్రేట్ అంటూ చెప్పుకు రావడం జరిగింది.

 

ఇప్పుడు ఇదే విధంగా సీఎం కేసీఆర్ కూడా కరోనా వైరస్ ని ఆరోగ్యశ్రీ లోకి చేర్చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాకుండా కరోనా వైరస్ విషయంలో రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులను ఎందుకు నియంత్రించడం లేదని ఉత్తమ్‌ కుమార్‌ ప్రశ్నించారు. తన ఇంటి ముందు పోలీసులను ఎందుకు పెట్టారని పోలీసులను ఉత్తమ్‌ ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: