కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. గతంలో ఏ వ్యాధి కూడా ఇలా ప్రపంచం మొత్తాన్ని కబళించలేదు. ప్రపంచంలోని కొన్ని దేశాలకే పరిమితం అయ్యేవి. కానీ కరోనా అలా కాదు. అదే సమయంలో ఈ కరోనా గురించి చైనా ప్రపంచ దేశాలను అలర్ట్ చేయలేదని విమర్శలు బాగా వచ్చాయి. 

 

 

 

అందుకే ఇప్పుడు చైనా ఏ కొత్త వైరస్ ఉనికి కనిపించినా ముందు ప్రపంచానికి చెప్పేస్తోంది. తన తప్పులేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. కొన్ని రోజుల క్రితం చైనా జీ 4 అనే భయంకరమైన వైరస్ గురించి చెప్పి భయపెట్టేసింది. ఇప్పుడు మరో మహమ్మారికి సంబంధించిన వివరాలు చెప్పి వణికిస్తోంది. ఈ కొత్త వైరస్‌ పేరేంటో తెలుసా.. బుబోనిక్‌ ప్లేగ్‌.. ఇది ప్లేగ్ వ్యాధుల్లో ఓ రకం అన్నమాట. 

 

IHG'rat and rodent infested' but his ...


ఈ కొత్త వైరస్  అడవి ఉడుత మాంసం ద్వారా వచ్చిందట.  చైనా సరిహద్దుల్లో ఉన్న మంగోలియాలోని ఖోవ్‌డ్‌ ప్రావిన్స్‌లో ఇటీవల రెండు బుబోనిక్‌ ప్లేగ్‌ వ్యాధి కేసులు బయటపడ్డాయి చైనా చెబుతోంది. అడవి ఉడుత అమ్ముతున్న ఇద్దరికి ఈ వ్యాధి సోకిందట.  వారిద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారట. వారితో కాంటాక్ట్‌ అయిన వారిని ఐసోలేషన్‌లో ఉంచారట. 

 

 


భయంకరమైన విషయం ఏంటంటే.. ఈ బుబోనిక్ ప్లేగ్ మహా డేంజర్. ఈ వ్యాధి వస్తే.. సరైన వైద్యం అందకపోతే.. రోగి 24 గంటల్లోనే చనిపోతాడని చెబుతున్నారు. ఈ  బుబోనిక్‌ ప్లేగ్‌ వ్యాధి అడవి ఎలుకలు, ఉడుతల్లో ఉండే బ్యాక్టీరియా నుంచి వ్యాపిస్తుందట. ఈ బ్యాక్టీరీయా కీటకాల ద్వారా ఇతర జంతువులు, మనుషులకు వ్యాప్తిస్తుందని తేలింది. అయితే దీని వ్యాప్తి గురించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: