దివంగ‌త మహానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. ఇలాంటి లీడర్ ని గతంలో ఎప్పుడైనా చూశారా ? పోనీ ఇతని తర్వాత ఎవరినైనా చూశారా ? పేద ప్రజల కోసం ఎంత చేశాడు ? గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా.. ఏ రాజకీయనాయకుడు అయినా ప్రజల కోసం అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడా? 

 

అందరూ బాగుండాలి. అన్ని ప్రాంతాలూ బాగుండాలి. అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం అని నమ్మిన వ్య‌క్తి వైయస్సార్.  ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. పాదయాత్ర అనేది అప్పటి వరకు లేదు. వైయస్సార్ తోనే పాదయాత్ర మొదలైంది. 

 

ఇప్పుడు సీఎం జగన్ పాదయాత్ర చేశాడు. ఎంతోమంది కష్టాలు తెలుసుకున్నాడు. రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఈ విషయం గురించి కష్టాలు పడుతున్నారు.. అనేది తెలుసుకొని ఇప్పుడు సీఎం జగన్ చేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభించాడు. ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్య.. ఒక చోటా కరెంటు లేదు.. మరోచోటా వైద్యం లేదు.. మరోచోట పండించిన రైతన్నకు గిట్టు బాటు ధరలు లేక ఆత్మహత్యలు. 

 

ఇవి అన్ని చూశాక వైయస్సార్ కు ఎం చెయ్యాలి అనేది అర్థం అయ్యింది. అంతే ప్రజలందరికి హామీ ఇచ్చాడు. ఇంకేముంది కనివిని ఎరగని రీతిలో వైయస్సార్ ను గెలిపించాడు. మాట ఇచ్చినట్టే మొదటి సంతకం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేశారు. 

 

ఇంకా ఆ తరువాత ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక సంక్షేమ పథకాలను వైయస్సార్ ప్రవేశపెట్టారు. రైతు రుణమాఫీలో, ఇందిరమ్మ ఇళ్లు అందడంలో, ఫించన్ల మొత్తాన్ని పెంచడంలో వైయస్సార్ కీలక పాత్ర పోషించారు. అందుకే అంటారు అలాంటి సీఎం నభూతో నభవిష్యతి అని. ఇంకా అయన ఆశ‌యాల‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన వైఎస్ జగన్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న కొడుకుగా ఆయనలానే ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేసి ఆంధ్రరాష్ట్ర పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: