భయం మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్లుతుంది.. అతనితో ఏపని అయినా చేయిస్తుంది.. అందుకే చైనా మనుషుల్లో ఉన్న భయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుందామనే ప్లాన్‌తో కరోనా సృష్టించింది కావచ్చూ.. ఇక ఈ వైరస్ ప్రపంచం మీదికి వదిలి తాను లాభపడుదామనుకున్నా, చివరికి లోకం దృష్టిలో మాత్రం కనీస విలువలు లేని దేశంగా చిత్రించబడింది. అయితే కరోనా వల్ల చైనాకు కలిగిన లాభం ఎంతో తెలియదు గానీ, మనదేశంలో అయితే ఈ కరోనా పేరు చెప్పుకుని కొందరు వ్యాపారులు మాత్రం బ్లాక్ దందాను యదేచ్చగా కొనసాగిస్తున్నారట..

 

 

అంతే కాదు కరోనా రోగుల అవసరాన్ని ఆదాయంగా మలచు కుంటున్నారట.. అంతే కదా అవకాశవాదుల కంటికి ఏ చిన్న సందు కనిపించిన అందులో ఉన్న లాభాలను చూస్తారే తప్పా, ప్రజల కష్టాల గురించి పట్టించుకోరు.. ఇకపోతే కరోనా వచ్చినప్పటి నుండి ప్రజలందరు బ్రతుకు మీద ఉన్న భయంతో, బ్రతకాలనే ఆశతో ఎన్నో రకాల మందులను వాడుతున్నారు.. ఇలా ఇప్పుడు జోరుగా సాగుతున్న వ్యాపారం ఏంటంటే మందుల వ్యాపారం.. ఇక ఆయుర్వేదం దగ్గరి నుండి అల్లోపతి, హోమియోపతి వరకు మందుల అమ్మకాలల్లో బిజిగా ఉన్నాయి.. అయితే ఢిల్లీలో మాత్రం కోవిడ్‌-19 చికిత్సకు వాడే రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌ అనే రెండు ప్రధానమైన ఔషధాలను అధిక ధరలకు బ్లాక్‌లో అమ్ముతున్నట్లు ఒక పత్రిక పరిశోధనలో తేలిందట. డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ఇవి బ్లాక్‌ మార్కెట్‌కు చేరాయని తెలుస్తోంది..

 

 

ఈ రాష్ట్రంలో కరోనాకు ముఖ్య ఔషదంగా పనిచేసే ఈ మందులను బ్లాక్ చేసి అధిక ధరలకు అంటే రూ.5400 ఉన్న రెమ్‌డెసివిర్‌ అనే ఈ మందు ధరను బ్లాక్‌లో రూ 30000 వేలకు అమ్ముతున్నారంటే అర్ధం చేసుకోండి.. మరోచోట ఇదే మందు ధరను  రూ.38,000 వేయిలు చెప్పారట. ఇకపోతే క్లినికల్‌ ట్రయల్స్‌ తర్వాత కోవిడ్‌-19 లక్షణాలను 11 రోజుల నుండి 15 రోజుల లోపల ఈ రెమ్‌డెసివిర్‌ తగ్గించగలదన్న గుర్తింపు రావడంతో ఆ ఔషధానికి డిమాండ్‌ పెరిగింది. కానీ ఈ మందు దివ్యౌషధమేమీ కాదని నిపుణులు హెచ్చరించారు. కాగా ప్రస్తుత పరిస్దితుల్లో ఇంతకన్నా మెరుగైన ఔషధాలు లేకపోవడంతో డాక్టర్లు ఈ మందును సూచిస్తున్నారు. దీంతో ఢిల్లీతో సహా భారతదేశంలోని అనేక నగరాలలో ఈ మందుకు భారీగా డిమాండ్‌ పెరిగింది.

 

 

ఈ నేపధ్యంలో తమ వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఢిల్లీలోని అనేకమంది పేషెంట్లు ఈ మందు కోసం అత్యధిక ధరలు చెల్లిస్తున్నారని, కొంతమంది తమ జీవితాంతం సంపాదించిన సొమ్మును కూడా ఈ మందు కోసం వెచ్చించారని ఒక పరిశీలనలో తేలిందట. ఈ సమయంలో ఇలా మనుషుల ప్రాణాలతో బిజినెస్ చేసే వారు మనుషులుగా పిలవబడుతున్నందుకు సిగ్గుపడాలి. ఏది ఏమైనా డబ్బుతోనే హాయిగా ఉండగలం అనుకుంటున్న వారు ఆ భ్రమ నుండి బయటకు వస్తే మంచిదని నెటిజన్స్ అంటున్నారట..  

మరింత సమాచారం తెలుసుకోండి: