తెలుగుదేశం పార్టీ ఎంతో పటిష్టంగా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుని.. మేం ఇక్కడినుంచి పోటీచేస్తాం అంటూ ముచ్చటపడడంలో సెలబ్రిటీలకు విలువ ఏముంది. ప్రజాదరణ నిజమే అయితే.. పార్టీకి గడ్డు స్థితి ఉన్న నియోజకవర్గాల్లో.. లేదా టైట్‌గా ఉండే నియోజకవర్గాల్లో పోటీచేసి గెలవాలి. అప్పుడే సదరు సెలబ్రిటీ నాయకుడికి కూడా విలువ. పార్టీకి కూడా లాభం. చంద్రబాబునాయుడు ఇప్పుడు నందమూరి సోదరులతో అలాంటి మైండ్‌ గేం ఆడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అత్యంత సేఫ్టీ ఉన్న సీట్లను ఎంచుకునే పనిలో ఇన్నాళ్లూ బాలకృష్ణ, హరికృష్ణ ఉన్నారు. అయితే వారు ప్రధానంగా కోరుకుంటున్న పార్టీ నిజంగానే బలంగా ఉన్న నియోజకవర్గాలు హిందూపురం, (అసెంబ్లీ మరియు పార్లమెంటు), గుడివాడ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికను చంద్రబాబు పూర్తి చేసేశారు. ఇప్పుడు వారు విజయావకాశాలు అటు ఇటుగా ఉండగల కొత్త నియోజకవర్గాలను వెతుక్కోవాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త నియోజకవర్గాలను ఎంచుకోవడం అంటే నందమూరి వారైనా సరే.. చెమటోడ్చి పోరాడాల్సిందే. ఏమీ చేయకుండా జస్ట్‌ ఎన్టీఆర్‌ కొడుకులు, సినీ నటులు అనే క్రేజ్‌తో గెలిచిపోయే సీట్లు అక్కడ ఖాళీ ఏమీ లేవు. అంటే.. దాదాపుగా వారు కోరుకునే సీట్లు కాకుండా కొత్త సీట్లను ఎంచుకోమనే సంకేతాలు ఇవ్వడం ద్వారా.. పదవులు కోరుకోవడం కాదు.. సొంతంగా గెలుచుకునే దమ్ముండాలి అని చంద్రబాబు నందమూరి సోదరులకు సవాలు విసిరినట్లుంది. ఇది వారికి చిక్కే. అయినా ప్రస్తుతానికి తప్పేదేమీ లేదు. తమ స్టామినా నిరూపించుకోవాలంటే... కొత్తస్థానాల నుంచైనా పోటీచేయాల్సిందే. పార్టీకి స్ట్రాంగు స్థానాలు ఎవరికి ఇచ్చినా గెలుస్తారని, కొత్తస్థానాలను బావమరుదులకు కేటాయిస్తే.. వారు గెలవగలిగితే పార్టీకి లాభం జరుగుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: