వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల రారాజు, ప్రీతిపాత్రుడు అని అందరికీ తెలిసిన విషయమే. పేదవాడికి కష్టం వస్తే లెక్కలు తొక్కలు పక్కన పెట్టి ముందు వారి ఆకలి తీర్చాలని మొదటిగా తపనపడే ఏకైక రాజకీయ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని గర్వంగా ప్రతి ఒక్క తెలుగు వాడు చెప్పుకుంటాడు అంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని మోయలేక పోయినా పేద ప్రజలు మంచిగా ఉండాలన్న ఆశయం తో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. పేదవాడి రోగాన్ని ఉచితంగా నయం  చేయాలని, ఆకలితో అలమటిస్తున్న ప్రతి ఒక్క పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టాలని తపన పడే ఆయన తరచూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉండేవారు. తన పాదయాత్రలో ప్రతి పేదవాడి సమస్యను తెలుసుకున్న వైయస్సార్ ప్రజలకు ఏం కావాలో ఏం చేస్తే వాళ్ళు సంతోష పడతారో అనే విషయాలు బాగా తెలుసుకున్నారు.


రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయంలో ఐదవ అంతస్తులో అతని ఆఫీసు ఉండేది. ఐదు అంతస్తులు పైకి చేరుకునేందుకు రాజశేఖర రెడ్డి కోసం ప్రత్యేకంగా లిఫ్టు ఉండేది. అయితే అతను లిఫ్ట్ దగ్గరకు రాగానే సచివాలయంలో ఉన్న ఇతర లిఫ్టు లన్నిటిని ఇబ్బంది నిలిపి వేసేవారు. అతను తన ఆఫీసు లోకి వెళ్లి కుర్చీ లో కూర్చున్న తరువాతనే ఇతర లిఫ్టులు పని చేసేవి. అతను సీఎం పదవిని అధిరోహించిన దగ్గర నుండి ఒక్కరే లిఫ్ట్ ఆపరేటర్ గా పని చేసేవారు. ఈ క్రమంలోనే రాజశేఖర రెడ్డి ఆ లిఫ్ట్ ఆపరేటర్ ను ప్రతి రోజూ చూసేవారు... అప్పుడప్పుడు ఎంతో ఆప్యాయంగా బాగున్నావా అని పలకరించేవారు. ఒకరోజు ఆ లిఫ్ట్ ఆపరేటర్ వైయస్సార్ ఆఫీస్ లోపలికి వెళ్లి నమస్కారం చేశాడు. ఆ సమయంలో వైఎస్ఆర్ ఏదో సమావేశంలో ఉన్నారు. లిఫ్ట్ ఆపరేటర్ ని చూసిన వెంటనే వైయస్సార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఏంటయ్యా ఇలా వచ్చావ్ అని అడిగాడు. దాంతో ఎంతో వినయంగా భయంగా ఆ లిఫ్ట్ ఆపరేటర్ మాట్లాడుతూ సార్, నేను ఈరోజు రిటైర్ అయిపోతున్నాను.  ఈ సందర్భంగా మా యూనియన్ వారు చిన్న పార్టీ ఇస్తున్నారు. చివరి సారిగా మీ దగ్గర సెలవు తీసుకుందాం అని వచ్చాను సార్ అని చెప్పాడు.


ఇది విన్న వైయస్సార్ మాట్లాడుతూ... 'మరి ఈ విషయం పొద్దున ఎందుకు చెప్పలేదయ్యా! కాసేపు ఇక్కడే ఉండు', అని తన కార్యదర్శులకు ఫోన్ చేసి తక్షణమే ఒక శాలువా ఒక బొకే తెమ్మని ఆదేశించారు. అంత లోపు లిఫ్ట్ ఆపరేటర్ ని దగ్గరికి పిలిచి అతని కుటుంబ విషయాల గురించి అడిగి అతనికి సొంత ఇల్లు లేదని పెళ్లి కావలసిన కూతుర్లు ఉన్నారని తెలుసుకున్నారు. వెంటనే తన సెక్రటరీని పిలిచి ఆ లిఫ్టు ఆపరేటర్ పేరుమీద ప్రభుత్వ స్థలం లో ఉన్న  రెండు ఎకరాల భూమికి పట్టా కాగితాలు అర్థ గంటలోపే సిద్ధం చేయమని ఆదేశించారు. ఇంతలోనే శాలువా, బొకే, స్వీట్లను కార్యదర్శులు ఆఫీస్ కి తెచ్చి ఇచ్చారు. అప్పుడు వైయస్సార్ ఆ ఉద్యోగికి స్వయంగా శాలువా కప్పి సన్మానం చేసి అతని చేతిలోనే కొంత నగదును ఇవ్వడంతోపాటు అతనికి భూమిపట్టా కాగితాల ఇచ్చి అవసరమైతే నాకు ఫోన్ చేయి అని చెప్పి పంపించివేశారు.



రాజశేఖర్ రెడ్డి గొప్ప మనసు ని ప్రత్యక్షంగా చూసిన ఆ లిఫ్ట్ ఆపరేటర్ ఎంతో భావోద్వేగానికి గురై ఆనంద భాష్పాలు కార్చుకుంటూ ఆఫీసు నుండి ఇంటికి ఎంతో సంతోషంగా వెళ్ళాడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే రాజశేఖర్ రెడ్డి తన జీవితంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసి వారి జీవితాలనే మార్చివేశారు. అందుకే అతను ఇప్పటికీ ప్రజల గుండెచప్పుడు గా మిగిలిపోయారు. అందుకే అతను బ్రతికి ఉంటే బాగుండు అని ఇప్పటికీ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: