వైఎస్‌ఆర్ అలియాస్‌ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి.. ఈ పేరుకు తెలుగువారికి విడ‌దీయ‌లేని అనుబంధం ఉంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశారు.  ప్రజల కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలనే సంక్షేమ పథకాలుగా రూపుదిద్ది ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమయ్యారు. వాస్త‌వానికి విద్యార్థి దశ నుంచే రాజకీయాలవైపు ఆకర్షితుడైన ఆయన ఎస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

 

ఆ తరువాత 1978లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సంవ‌త్స‌రంలో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన వైఎస్ వ‌రుస‌గా మూడు సార్లు పులివెందుల నుంచి గెలుపొంది హ్యాటిక్ విజయం సాధించారు. అయితే  1983,1985ల్లో పులివెందుల నుంచి గెలుపొందిన వైఎస్.. అప్పట్లో ఏపీలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న టైమ్‌లో తన పదునైన వ్యాఖ్యలతో అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించారు. 

 

అదే సమయంలో వైఎస్ వాక్‌చాతుర్యం, నాయకత్వ లక్షణాలను మెచ్చిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ.. ఆయనకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని కూడా కట్టబెట్టారు. ఆ త‌ర్వాత‌ కడప నియోజకవర్గానికి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు గెలుపొంది.. పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఇక మ‌ళ్లీ పులివెందుల అసెంబ్లీ నుండి పోటీ చేసిన వైఎస్‌‌.. వ‌రుస‌గా మూడు సార్లు విజ‌యం సాధించి డ‌బుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. అయితే 2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో వైఎస్ పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించాడు. 

 

ఆ పాదయాత్ర వల్ల‌ వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. ఈ క్ర‌మంలోనే 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ అధికారంలోకి వ‌చ్చారు. అయితే విధి వక్రీకరించి.. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన రెండు నెలలకే తెలుగు ప్రజలందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే ప్ర‌స్తుతం ఆ మ‌హానుభావుడు మ‌న మ‌ధ్య లేక‌పోయినా.. ఆయ‌న ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం చరిత్రలో నిలిచిపోయాయి.

 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: