ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోశయ్య గురించి తెలియని వారు ఉండరు. రోశయ్య అనగానే చాలా మందికి ఆర్ధిక మంత్రిగానే పరిచయం ఉంది. ఆయన పేరు ఎవరు  విన్నా సరే ఆయనను ఆర్ధిక మంత్రి అనే అంటారు ఇప్పటికి. రాజకీయాల మీద కనీస అవగాహన ఉన్న ఎవరు అయినా సరే రోశయ్య గురించి అదే మాట మాట్లాడతారు. ఇక ఆయన ఏ ప్రభుత్వం లో ఏ శాఖ నిర్వహించినా సరే ఆ శాఖలో చాలా సమర్ధంగా పని చేస్తారు అనే పేరు ఆయనకు ఉంది అనే చెప్పాలి. ఇక ఆయన సమర్ధతను గుర్తించిన వారిలో వైఎస్ కూడా ఒకరు అని చెప్పాలి. 

 

అవును ఆయనకు ఆర్ధిక శాఖ లో పూర్తి స్వేచ్చ వైఎస్ ఇచ్చే వారు అని  అంటారు. వైఎస్ ఆయన నుంచి ఎన్నో సలహాలను సూచనలను తీసుకునే వారు అని అప్పట్లో ఆర్ధిక వ్యవస్థ నిర్వహణ చాలా కష్టంగా ఉండేది అని కాని వనరులను ఏ విధంగా సృష్టించాలి ఏ విధంగా బడ్జెట్ తయారు చెయ్యాలి అనే దాని విషయంలో వైఎస్ పూర్తి స్థాయిలో స్వేచ్చ ఇచ్చే వారు అని అంటారు. వైఎస్ ఇచ్చిన స్వేచ్చను ఆయన కూడా సమర్ధంగానే వాడుకున్నారు. ఆర్ధిక శాఖలో ఆయన వేసిన బీజాలు ఇప్పటికి కూడా ఉపయోగపడుతున్నాయి అని చాలా మంది అంటూ ఉంటారు.

 

వైఎస్ ఆయనలో ఉన్న సామర్ధ్యాన్ని గుర్తించి ప్రతీ ఒక్కటి కూడా చెప్పే వారు అని అందుకే  అప్పుడు సంక్షేమ పథకాలకు ఏ  లోటు లేకుండా చూసారు అంటారు. ప్రభుత్వం లో వైఎస్ కి బాగా నచ్చిన మంత్రి రోశయ్య అని అంటారు. రోశయ్య నుంచి వైఎస్ కూడా చాలానే నేర్చుకునే వారు. ప్రభుత్వంలో తన తర్వాత ఆయనే అనే విధంగా వ్యవహరించారు. శాసన సభలో సైతం ఆయనకు పూర్తి స్థాయిలో స్వేచ్చ ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: