అచ్చం సినిమాల్లో విలన్లు పోలీసులపై విచక్షణారహితంగా ఎలా ఎటాక్ చేసి చంపుతారో అదే తరహాలో అదే తరహాలో కాన్పూరులో 8 మంది పోలీసులను హతమార్చిన తర్వాత వికాశ్ దూబే.  పోలీసులు తనను పట్టుకోవడానికి వస్తున్న సమాచారం ముందుగానే తెలుసుకొని డీఎస్పీ, ఎస్సై, కానిస్టేబుల్స్ ని దారుణంగా హతమార్చారు. ఈ కేసును కాన్పూర్ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇప్పటికే వివేక్ దుబే అనుచరులను ఇద్దరిని హతమార్చారు.  హత్యాకాండ పూర్తయిన తర్వాత వివేక్ దుబే అతని గ్యాంగ్ తో పారిపోయారు.  దూబే కోసం 40 ప్రత్యేక పోలీసు బృందాలు 100 ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. కాగా, హమీర్‌పూర్ జిల్లాలోని మౌదాహాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమర్ దూబేను పోలీసులు కాల్చి చంపారు. అమర్ దూబే కూడా హిస్టరీ షీటరేనని, వాంటెడ్ క్రిమినల్ అని పోలీసులు తెలిపారు.

IHG's close aide <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AMAR' target='_blank' title='amar -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>amar </a>Dubey shot dead in ...

ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు అతడిని మట్టుబెట్టినట్టు అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో వెళ్లిన సిబ్బందిపై మరోసారి అతడు దాడికి పాల్పడటంతో హతమార్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా పోలీసులు విడుదల చేశారు.  అమర్ దుబే గ్యాంగ్ స్టర్ వికాశ్ దుబేకు ప్రధాన అనుచరుడిగా ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలను కూడా విడుదల చేశారు. అయితే పోలీసు శాఖలోని కొంత మంది గూఢచారుల వల్లే ఈ విషయం తెలిసిందని 68 మంది కాన్పూర్ పోలీసులపై బదిలీ వేటు వేశారు.

IHG

ఎస్పీ అనంత్ దియో తివారీని కూడా  మరో చోటుకు పంపించారు. తాజాగా  యూపీ పోలీసులు వికాస్ దూబే అనుచరుల ఫోటోలను ఈరోజు విడుదల చేశారు. వీరంతా వికాస్‌ దూబేతో పాటు పరారీలో ఉన్నారు. ఈ ముఠాలో ఒకడైన దయా శంకర్ అగ్నిహోత్రిని ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్ తరువాత అదుపులోకి తీసుకున్నారు. దూబే అనుచరులను ప్రజలు గుర్తించి సమాచారం అందించేందుకు వీలుగా వారి ఫోటోలను విడుదల చేసినట్టు పోలీసులు వెల్లడించారు. త్వరలో వీరందరినీ పట్టుకొని చట్టం ముందు నిలబెడతాం అని పోలీసులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: