రాజకీయం అంటే నీకు ఎం కావాలి నాకు ఏం చేస్తావ్... దాదాపుగా ఇదే విధంగా ఉంటుంది. ఎవరు రాజకీయం చేసినా సరే ఇలాగె చేస్తారు. దానిని మించి రాజకీయాల్లో చేయడానికి ఏమీ ఉండదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కాని రాజకీయాల్లో   కొందరు నాయకులు అందుకు భిన్నంగా రాజకీయం చేసారు. ఎదుటి వాడి నుంచి తీసుకోవడం కాదు  మనం ఇస్తే ఎదుటి వాడు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు అనే విధంగా రాజకీయం చేసారు. అందులో ప్రధానంగా వైఎస్ ఒకరు. ఆయన చేసిన రాజకీయం దాదాపుగా అలాగే ఉండేది. 

 

వైఎస్ రాజకీయంలో రాజీ పడి చేసేది ఏమీ ఉండదు. ఆయన దూకుడుగా నిర్ణయాలు తీసుకునే వారు. కాంగ్రెస్ a అనేది ఒక సముద్రం. ఆ సముద్రంలో ఆయన సమర్ధవంతంగా నాయకులను ఎదుర్కొని రాజకీయం చేసారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆ పార్టీలో ఎవరు ఏ విధంగా ఆయన మీద సహనంగా ఉన్నా అసహనంగా ఉన్నా సరే వారిని ఆయన స్నేహం తో తన రాజకీయ వ్యూహ౦తో తన వైపుకి తిప్పుకున్నారు అనే చెప్పాలి. జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన అదే విధంగా పాపులర్ అయ్యారు. 

 

ఆయన రాజకీయం ఇప్పటి సిఎం లు గా ఉన్న అశోక్ గెహ్లాట్ కి కూడా నచ్చింది అంటే చెప్పవచ్చు ఆయన ఏ రేంజ్ లో రాజకీయం చేసారు అనేది. సమర్ధవంతమైన పాలన అందించడమే కాదు టికెట్ ల కేటాయింపు విషయంలో కూడా ఎక్కడా కూడా అసమ్మతి అనేది లేకుండా చేసారు. ఎదుటి వాడి నుంచి ఆయన ఏమీ ఆశించే వారు కాదు. కాని తాను చెయ్యాలి అనుకునేది మాత్రం సమర్ధంగా చేసి దానితో ఎదుటి వారిని తన వైపుకి వైఎస్ అమర్ధంగా తిప్పుకుని తిరుగులేని నాయకుడిగా ఒక వెలుగు వెలిగారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: