తెలంగాణా ఉద్యమం... దేశ వ్యాప్తంగా కూడా ఒక సంచలనం అది. ఆ మాట వినపడగానే చాలా మంది రాజకీయ నాయకులు ప్రధానులుగా పని చేసిన వారు ఇప్పటికి కాంగ్రెస్ లో ఉన్న కీలక నేతలు చాలా మంది ఇబ్బంది పడే వారు. తెలంగాణా ఉద్యమం మొదలు నుంచి చివరి వరకు కూడా చాలా మంది రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది అనేది వాస్తవం. అప్పట్లో ఆ ఉద్యమం సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఇక కేసీఆర్ ఎప్పుడు అయితే తెరాస పార్టీని స్థాపించి ఉద్యమాన్ని తీసుకున్నారో ఇక అక్కడి నుంచి మరింత దూకుడుగా వెళ్ళింది. 

 

అయితే సిఎం గా వైఎస్ ఉన్న సమయంలో తెలంగాణా ఉద్యమాన్ని దాదాపుగా కట్టడి చేసారు. ఏది అయితే తెలంగాణా కోరుకుంటుందో అది తెలంగాణకు ఆయన అందించారు అనే చెప్పాలి.  వారికి కావాల్సిన నీళ్ళు  నిధులు నియామకాలు అన్నీ కూడా ఆయన పటిష్టంగా అందించి ఆ పార్టీ ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసారు అని చెప్పవచ్చు. రాజకీయంగా తెరాస పార్టీ  నాడు బలహీనంగా ఉంది అంటే వైఎస్ అనుసరించిన విధానాలు అని స్పష్టంగా అందరికి అర్ధమవుతుంది. ఆ  పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ డిమాండ్ లకు వైఎస్ ఎక్కడా కూడా భయపడే వారు కాదు. 

 

తెరాస పార్టీ ఏది అయితే ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అని చూసిందో దాన్ని సమర్ధవంతంగా  ఆయన ఎదుర్కొని వాటిని ప్రజల్లోకి తన పాలన ద్వారా తీసుకుని వెళ్ళారు. తెలంగాణాలో ఎన్నో సాగునీటి ప్రాజెక్ట్ లను వైఎస్ నిర్మించారు. ఇప్పటికి కూడా అది ఒక సంచలనం. తెలంగాణా కు ఆ స్థాయిలో ఇప్పుడు కేసీఆర్ కూడా చేయడం లేదు అని అంటారు చాలా మంది. ఆ విధంగా వైఎస్ బలంగా పార్టీని తీసుకుని వెళ్ళారు పాలన అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: