ఏ పేరు చెబితే తెలుగు ప్రేక్షకుల గుండెలు ఉప్పొంగుతాయో... ఏ పేరు చెప్తే మహానేత ప్రతిబింబం మనసులో మెదులుతుందో... ఏ పేరు చెప్తే ఆయన లేరని తెలుగు ప్రజల గుండెలు తీవ్రంగా రోధిస్తాయో ఆ పేరే వైయస్ రాజశేఖర రెడ్డి. పులివెందుల పులిబిడ్డ, ముందుచూపు కలిగిన గొప్ప ప్రజ్ఞాశాలి, ప్రపంచంలోనే అతి గొప్ప రాజకీయవేత్త, ప్రజల రారాజు, మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఏకైక రాజకీయవేత్త... ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల గుండెల్లో మంచి స్థానాన్ని ఏర్పరచుకున్న అసలు సిసలైన నిజాయితీ గల రాజకీయవేత్త మన దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి. 2009 సెప్టెంబర్ 2వ తేదీన రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటికీ... తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ బతుకుతూనే ఉంటారు. ఈరోజు అతని 71వ జయంతి సందర్భంగా అతని బాల్యం గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు లోని జయమ్మ, రాజా రెడ్డి దంపతులకు 1949 జూలై 8 వ తేదీన సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. తండ్రి రాజారెడ్డి బళ్లారిలో కాంట్రాక్టర్ గా పని చేస్తుండేవారు. దీంతో రాజశేఖరరెడ్డి ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు బళ్లారి లోని సెయింట్ జాన్స్ స్కూల్ లో చదువుకున్నారు. తన ఇంటర్మీడియట్ విద్యను విజయవాడలోని లయోలా కాలేజీలో పూర్తి చేశారు. తదనంతరం తన 23వ యేటా గుల్బర్గా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను పూర్తి చేశారు.


గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే అతను విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. అప్పుడే తనలో గొప్ప నాయకుడు ఉండని ఆ కళాశాల విద్యార్థులకు బాగా అర్థమైపోయింది. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య విద్యాభ్యాసం చేసి హౌస్ సర్జన్ పట్టాను పొందారు. వైయస్సార్ ఒక వైపు లీడర్ గా కొనసాగుతూనే మరో వైపు చదువుల్లో రాణించేవారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో హౌస్ సర్జన్ గా బాధ్యతలు చేపడుతూ హౌస్ సర్జన్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. చదువుకుంటున్న రోజుల్లోనే వైయస్సార్ రాజకీయం వైపు బాగా ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత రాజకీయ ఆరంగేట్రం చేసి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి చరిత్ర సృష్టించారు.



Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: