ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటే  ఎవరికి పెద్దగ పరిచయం లేదు గాని ఆ పార్టీ ఒకప్పుడు ఎంతో బలంగా ఉండేది. కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం ఎక్కువగా ఉండేది అప్పట్లో అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇక వైఎస్ లాంటి నాయకులు పీవీ లాంటి నాయకులు ఆ పార్టీని ఎక్కడికో తీసుకుని వెళ్ళారు. ఎంత మంది ఎన్ని వివాదాలు సృష్టించినా సరే వైఎస్ లాంటి నాయకులు తమ దూకుడు తో ఎదుర్కొని పార్టీని అన్ని విధాలుగా కూడా బలోపేతం చేసారు అనే చెప్పాలి. 

 

ప్రధానంగా వైఎస్ చేసిన రాజకీయం దెబ్బకు చాలా మంది అప్పట్లో ప్రత్యర్ధులు కూడా ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితికి వెళ్ళారు. చంద్రబాబు సహా వామపక్షాలు అప్పుడు క్షేత్ర స్థాయిలో ఎన్నో ఇబ్బందులు పడ్డాయి వైయస్ దెబ్బకు. అసలు టీడీపీ మనుగడ ఉంటుందా అనే విధంగా అప్పట్లో రాజకీయం జరిగింది అని చెప్పాలి. వైఎస్ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిన తీరు ఆయన  పాలనలో ప్రవేశ పెట్టిన కొన్ని కొన్ని కార్యక్రమాలు పార్టీ దశ దిశా అన్నీ కూడా మార్చాయి అనే చెప్పాలి. నేటికి కూడా అవి ప్రజల్లోనే ఉన్నాయి అని చెప్పాలి.

 

వైఎస్ మీద కాంగ్రెస్ అధిష్టానమే కాదు అన్ని పార్టీ ల నేతలు కూడా అప్పట్లో ప్రసంశలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి. ఆయన అప్పుడు సమర్ధనేతగా పార్టీని ముందుకు నడపడమే కాదు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళారు. ఆయన ప్రవేశ పెట్టిన కొన్ని కార్యక్రమాలు పార్టీ ని ఎంతో బలోపేతం చేసాయి అనేది వాస్తవం.  ఇప్పుడు అలాంటి నాయకుడు ఆ పార్టీలో కనపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: