ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్  లో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు చరిత్ర సృష్టించింది అంటే దానికి కారణం వైఎస్ చేసిన పాదయాత్ర అని చాలా మందికి స్పష్టంగా తెలుసు. ఆయన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకుని రావడానికి గానూ చేవెల్ల నుంచి ఇచ్చాపురం వరకు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసారు. దారిలో ప్రజల కష్టాలు ఆయన విన్నారు. వారి కష్టాలకు నేను ఉన్నా అన్నారు.  ఆయన మాట వింటే అప్పుడు జనాలకు ఒక హుషారు వచ్చేది. ఇక కాంగ్రెస్ ఆయన అధికారంలోకి తీసుకుని రావడానికి చాలానే కష్టపడ్డారు అని చెప్పాలి. 

 

అప్పుడు కాంగ్రెస్ కోసం ఆయన వేల కిలోమీటర్లు ప్రయాణాలు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడమే కాకుండా పార్టీని గ్రౌండ్ లెవెల్ లో బలోపేతం చేసారు వైఎస్. అది పార్టీ పటిష్టానికి బాగా ఉపయోగపడింది అని చెప్పవచ్చు. ఇక పార్టీలో ఆయన అసమ్మతి నేతలను కూడా దాదాపుగా కట్టడి చేస్తూ వచ్చారు. ఇక ఆయన పాదయాత్ర విషయానికి వస్తే ఆయనను యాత్ర చేయనీయకుండా అడ్డుకోవడానికి గానూ చాలా మంది చాలా రకాలుగా అప్పుడు ప్రయత్నాలు చేసారు అనే ఆరోపణలు ఉన్నాయి. 

 

జేసీ దివాకర్ రెడ్డి సహా కొందరు నేతలు ఆయనను అడ్డుకోవాలి అని ప్రయత్నం చేసారు అని అంటారు. రాయలసీమకు చెందిన కొందరు నేతలు కూడా ఆయన సిఎం అవుతారు అని భావించి ఆయనను అడ్డుకోవాలి అని చూసారు అని అంటారు. అయినా సరే వైఎస్ మొండి గా రాజకీయం చేసి ప్రజల్లోకి బలంగా వెళ్ళారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి గానూ ఆయన చేసిన పాదయాత్ర బాగా ప్లస్ అయింది అని ఇప్పటికి కూడా చాలా మంది అంటూ ఉంటారు. ఆయన ఆ రోజు నడవకపోతే కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో నిలబడి ఉండేది కాదని అంటారు రాజకీయాల మీద అవగాహన ఉన్న ఎవరు అయినా.

మరింత సమాచారం తెలుసుకోండి: