కాంగ్రెస్ అనగానే చాలా వరకు అధిష్టానం పెత్తనం మాత్రమే ఉంటుంది... అధిష్టానం మాట  మాత్రమే వినాలి అని చెప్తూ ఉంటారు. అధిష్టానం మాట వినని ఏ నాయకుడు అయినా ఎంత బలవంతమైన నేత అయినా సరే ఆయనకు ప్రాధాన్యత అనేది పార్టీలో ఉండే అవకాశం  దాదాపుగా ఉండదు అని చెప్తూ ఉంటారు. కాని ఉమ్మడి ఏపీ లో వైఎస్ విషయంలో మాత్రం అలా ఉండేది కాదు. రాష్ట్ర పార్టీలో ఆయన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు జోక్యం చేసుకునేది కాదు. సీనియర్ నేతలతో ఆయన ఎప్పటికప్పుడు సమన్వయము చేసుకుంటూ రాజకీయం చేసారు. 

 

రాజకీయాల్లో ఏది కావాలో అది బాగా తెలిసిన నేత వైఎస్. అందుకే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో స్వేచ్చ అనేది ఇస్తూ వచ్చింది. ఆయనకు ఎదురు చెప్పడం గాని ఆయన నిర్ణయాలను వ్యతిరేకించడం గాని సోనియా గాని మరొకరు గాని  చేయలేదు అనే చెప్పాలి. చాలా మంది సీనియర్ నేతలు ఉన్నా సరే వైఎస్ మాత్రం చాలా ప్రత్యేకంగా బలమైన నేతగా కాంగ్రెస్ లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని రాజకీయం చేసారు అనే చెప్పాలి. అందుకే ఆయన తమ్ముడ్ని ఎంపీ ని చేసినా కొడుకుని ఎంపీ ని చేసినా అధిష్టానం మరో మాట మాట్లాడలేదు. 

 

ఎవరికి ఎంపీ సీటు ఇచ్చినా ఎమ్మెల్యే సీటు ఇచ్చినా సరే వైఎస్ ని మించిన రాజకీయం చేసే వారు కాదు. అధిష్టానం నుంచి ఏ ఒత్తిడి ఆయన మీదకు వచ్చిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. రాజకీయంగా వైఎస్ ని చాలా వరకు సమర్ధవంతంగా పని చేసారు కాబట్టే ఆయనకు అధిష్టానం ఆ విధంగా మంచి గుర్తింపు ఇచ్చింది అనే మాట చెప్పవచ్చు. ఇక ఆయన చేసిన పాలన కూడా అధిష్టానం మెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: