దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పార్టీ దాదాపుగా వందేళ్ళ నుంచి దేశంలో రాజకీయం చేస్తూనే ఉంది. గాంధీ నుంచి మొదలు పెడితే ఇప్పటి రాహుల్ వరకు ఆ పార్టీలో కీలకంగా ఉన్న వారే. ఇక దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ అధికారం చూసిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ అనే పేరు ఇప్పటికి అలాగే ఉంది. అయితే ఆ పార్టీ నుంచి వచ్చిన సమర్ధవంతమైన నాయకులే ఆ పార్టీకి ఆ స్థాయిలో బీజాలు వేసారు. అందులో ప్రధానంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో. 

 

ఏపీలో వైఎస్ ఆ పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచారు. టీడీపీ హవా ఎక్కువగా ఉన్నా సరే వైఎస్ మాత్రం ఎక్కడా భయపడకుండా  కాంగ్రెస్ ని రాష్ట్రంలో దాదాపుగా నిలబెట్టారు అనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ని వరుసగా రెండు సార్లు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆయన అధికారంలోకి తీసుకుని వచ్చారు. వైఎస్ రాజకీయమే దానికి కారణం.  చంద్రబాబు ని ఎన్టీఆర్ ని ఆయన సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు అనే చెప్పాలి. వారికి దీటు గా ఆయన రాజకీయం చేసి పార్టీని నిలబెట్టారు అని చాలా మంది అంటూ ఉంటారు. వైఎస్ రాజకీయ జీవితంలో అవే కీలకం. 

 

చంద్రబాబు సహా కొందరు నేతలను ఆయన ఎదుర్కొన్న తీరు... చంద్రబాబు సిఎం గా ఉన్నా సరే ఆయన మీద ఉన్న వ్యతిరేకతను ఉమ్మడి ఏపీ లో బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళిన తీరు ఇప్పటికి కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. అలా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం పెంచడమే కాదు నాయకత్వ బలం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ పెంచారు అనే సంగతి అందరికి స్పష్టంగా తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి: