వైఎస్ రాజశేఖర్ రెడ్డి... ఈ పేరు ఇప్పటికి కూడా ఒక సంచలనమే. ఆయన మరణించి పదేళ్ళు దాటినా సరే ఆయన గురించి ఏదోక సందర్భంలో ఎక్కడో ఒక చోట నిత్యం ఆయన మాట వస్తూనే ఉంటుంది. రాజకీయాల్లో ఆయనను మించిన నాయకుడు లేరు. ఆయనను మించి రాజకీయం ఆయనతో పాటుగా చేసిన నాయకుడు మరొకరు లేరు అనేది వాస్తవం. ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆయన స్నేహం. ఆయన స్నేహం చేస్తే ప్రాణం ఇస్తారు అని చాలా మంది అంటారు. ఆయన స్నేహం గురించి తెలిసిన వాళ్ళు... 

 

ఆయనతో స్నేహం చేసిన వాళ్ళు ఎందరో నేటి రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పుకునే నేతలు కొందరు ఉన్నారు. సాయి ప్రతాప్ అనే మాజీ ఎంపీ ఒకరు. ఆయనకు వైఎస్ కు చిన్న నాటి నుంచి ప్రత్యేకంగా స్నేహం ఉంది. వారు ఇద్దరూ కూడా చాలా కాలం కలిసి రాజకీయాలు చేసారు. అందుకే రాజంపేట టికెట్ ఆయనకు ఇచ్చి ఎంపీని చేసారు వైఎస్. ఆయన కోసం ప్రత్యేకంగా వైఎస్ పని చేసారు. వైఎస్ రాజకీయంలో ఏ విధంగా వ్యవహరించినా సరే ఆయనకు మాత్రం ఎక్కడా అన్యాయం చేసే వారు కాదు. 

 

రాష్ట్రంలో ఆయన పెత్తనం కాంగ్రెస్ లో ఎక్కువగా ఉండేది కాబట్టి ఆయనే సీట్ల కేటాయింపు వ్యవహారం దాదాపుగా చూసుకునే వారు. ఇక అది అలా ఉంటే వైఎస్ మరణం తర్వాత ఆయన చాలా రోజుల పాటు బయటకు రాలేదు అని చెప్తూ ఉంటారు. కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆయన వైసీపీ లోకి కూడా వెళ్ళలేదు గాని  కాంగ్రెస్ లో తనతో పని చేసిన నాయకులతో టచ్ లో మాత్రం ఉండే వారు అని చెప్తారు. ఆయన ఆ తర్వాత టీడీపీ లో జాయిన్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: