పోస్ట్ ఆఫీస్ అనేక రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. దీని ద్వారా ఎక్కువ రాబడిని పొందవచ్చు. మీ డబ్బులు కూడా సురక్షితంగా ఉంటాయి. అయితే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో రికవరింగ్ డిపాజిట్ ఎకౌంట్ తెరిచిన వారికి ముఖ్యమైన అలెర్ట్. కేంద్ర ప్రభుత్వం ఈ అకౌంట్లకు సంబంధించిన రూల్స్ ని కొంచెం సవరించింది. దీని వల్ల పోస్ట్ ఆఫీస్ లోనూ బ్యాంకు లోను రికరింగ్ డిపాజిట్లు ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలిగి ఉంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం కేంద్రం ఏం చెప్పిందంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆర్డీ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయకపోయినా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పింది.

 

అంతేకాకుండా మీ అకౌంట్ డిఫాల్ట్ కూడా అవ్వదు ఎలాంటి చార్జీలు కూడా మీరు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. జూలై 31 లోపు మీరు మీ డబ్బులు ఆర్డీ   ఎకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. మీరు మీ ఆర్డీ ఎకౌంట్లో నెలకి వంద రూపాయలు నుండి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు తక్కువ  డబ్బుతో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే మెచ్యూరిటీ సమయంలో మంచి రాబడి కూడా వస్తుంది. ఆర్డీ అకౌంట్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఈ గడువు తర్వాత కూడా ఆర్డీ అకౌంట్ మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ కూడా వెళ్ళవచ్చు. మీరు రోజుకి ఎంతో కొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు.

 

ఒకవేళ కనుక మీరు రూపాయలు యాభై ఆదా చేస్తే నెలకి రూ 1550 ఎకౌంట్లో జమ చేయవచ్చు.  ఆర్డీ అకౌంట్ పై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది ఇది మూడు నెలలకు ఒకసారి మీ అకౌంట్లో జమ అవుతుంది. అదే కనుక మీరు ఒకవేళ రూ. 50 ఆదా చేస్తూ నెలాఖరు లో డిపాజిట్ చేస్తే ఐదేళ్లలో అది రూపాయలు 1.05 లక్షలు అవుతుంది. అలానే పదేళ్లలో అది 2.75 లక్షలు అవుతుంది. పదిహేనేళ్ళ లో  4.3 లక్షలు మీరు  పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: