మీరు బ్యాంక్ అకౌంట్ తెరవాలని ఆలోచిస్తున్నారా..? అయితే నిజంగా  మీకు ఒక శుభవార్త అని చెప్పాలి. అంతే కాకుండా మీరు ఏ మినిమం బ్యాలన్స్ లేకుండానే ఈ అకౌంట్ తెరవొచ్చు. అలాగే వివిధ రకాల బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. అయితే ఫినో పేమెంట్ బ్యాంకు తాజాగా కొత్త బ్యాంక్ అకౌంట్ సర్వీసులను ప్రారంభించింది.  కేవలం పిల్లలు మాత్రమే దీని సేవలు పొందడానికి అర్హులు. ఈ బ్యాంక్ అకౌంట్ పేరు భవిష్య సేవింగ్ అకౌంట్ . ఈ అకౌంట్ తెరవడానికి చిన్నారులు పదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళు ఈ ఖాతాని తీసుకోవచ్చు.

 

మన భారత దేశం బలం యువత అయితే యువతకి నైపుణ్యాల తో పాటు చిన్ననాటి నుంచి బ్యాంకింగ్ సర్వీసుల పై అవగాహన కల్పించడం కూడా ముఖ్యం. అందుకని పిల్లలు తమ ఆధార్ కార్డు తో తమ బ్యాంక్ ఖాతాలు తెరవవచ్చు అని  బ్యాంక్ సీఓఓ ఆశిష్ అహుజా చెప్పారు . అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకు పొదుపు గురించి చిన్న తనం నుంచి అలవాటు చేయడం ముఖ్యమని చెప్పారు .


 

భవిష్య సేవింగ్ అకౌంట్ తెరిస్తే ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ కూడా అక్కర్లేదు . అలానే ఉచితం గానే డెబిట్ కార్డుని మీరు పొందవచ్చు. కేవలం ఈ కార్డు ఏటీఎం క్యాష్ విత్ డ్రా  కి మాత్రమే ఉపయోగించడం అవుతుంది. అంతే కాకుండా వాళ్ళకి 18 ఏళ్ళ వయస్సు దాటి పోయిన తర్వాత ఈ అకౌంట్ ని రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ లోకి కూడా మార్చుకోవచ్చు. అలానే పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్ నేరుగా ఈ బ్యాంక్ ద్వారా పొందవచ్చు . ఈ బ్యాంక్ గ్రామాల్లో శర వేగంగా విస్తరించే అవకాశం ఉందని కూడా వాళ్లు తెలియ జేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: