ప్రస్తుతం కరోనా  వైరస్ పుణ్యమా అని అందరూ ఇంటి నుంచే పని చేసుకుంటున్నా విషయం తెలిసిందే. ఏదైనా సమావేశం కావాల్సి వస్తే అందరూ కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రతి రంగంలో కూడా వీడియో కాన్ఫరెన్స్  ద్వారా నే సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉద్యోగులు వ్యాపారులు నాయకులు అధికారులు అందరూ డైరెక్ట్ గా మీటింగులు పెట్టుకోకుండా సామాజిక దూరం పాటిస్తూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ పుణ్యమా అని ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. 

 

 మొన్నటికి మొన్న ఓ మహిళా ఉద్యోగి ఏకంగా టాయిలెట్ లో  మూత్రవిసర్జన చేస్తూ వీడియో మీటింగ్లో పాల్గొనడం సంచలనంగా మారింది. ఇక తాజాగా ఓ వ్యక్తి స్నానం చేస్తూ నగ్నంగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన కాటాంబ్రియాలో  చోటుచేసుకుంది. టోర్రెల వేగా కమ్యూనిటీ పార్ట్ టైమ్  కౌన్సిలర్ గా పనిచేస్తున్న బెర్నాడో బుస్టిల్లా.. ఇటీవలే ఒక ఆన్లైన్ మీటింగ్ లో పాల్గొన్నాడు. ఈ మీటింగ్ టీవీ లో కూడా ప్రసారమైంది. అయితే  తనకు స్నానం చేయడానికి టైం సరిపోవడం లేదని లాప్టాప్ తీసుకెళ్లి బాత్రూంలో స్నానం చేస్తు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. 

 

 మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నారో వినాలి   అనుకున్నాడు.. కానీ  తన లాప్ టాప్ వీడియోను ఆఫ్  చేయడం మర్చిపోయాడు... దీంతో అతని నగ్న అవతారాన్ని వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  అధికారులతో పాటు టీవీలో ప్రసారం కావడంతో ప్రజలు అందరూ చూసి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇది చూసిన అధికారులు వెంటనే అతనికి కాల్ చేసినప్పటికీ బాత్రూం లో ఉండడంతో ఫోన్ సౌండ్ వినిపించలేదు. చివరికి మేయర్ చేసేదేమీలేక మీటింగ్ ని ఆపేశాడు. ఈ విషయం తెలిసిన తర్వాత బెర్నాడో  ఎంతగానో ఫీల్ అయి పోయారు.. ఇక ఆ వ్యక్తి అధికారులను క్షమాపణలు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: