సైబర్ నేరగాళ్ల బెడద  రోజురోజుకు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. తమకున్న తెలివిని  ఏదో మంచి పని కోసం ఉపయోగించకుండా సైబర్ నేరాలకు పాల్పడి జనాల్ని బురిడీ కొట్టించడానికి ఉపయోగిస్తున్నారు. ఇలా రోజురోజుకు సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోతున్న ప్రజలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రతి విభాగంలో కూడా ఈ కేటుగాళ్ల బెడద ప్రజలకు తప్పడం లేదు. మొన్నటికి మొన్న ఆరోగ్య సేతు పిఎం కేర్ ఫండ్  పేరిట నకిలీ రిక్వెస్ట్ లు పంపి ఎంతోమంది ఖాతాలను ఖాళీ చేసి డబ్బులు దండుకున్నారు కేటుగాళ్లు... ప్రస్తుతం సరికొత్త ఎర తో  ప్రజలను బురిడీ కొట్టించేందుకు సిద్ధమవుతున్నారు. 

 

 ప్రస్తుతం టిక్టాక్ యూజర్లు నిర్లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. సెల్ఫోన్లకు యుఆర్ఎల్ మాల్వేర్ లింకులను ఎస్ఎంఎస్ రూపంలో పంపి... టిక్ టాక్ రూపు మారిందని దీనికోసం టిక్ టాక్ ప్రొ  అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి అంటూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. ఇక ఇప్పటికే టిక్టాక్ నిషేధంతో అయోమయంలో పడిన కొంతమంది నెటిజన్లు టిక్ టాక్ మళ్లీ వస్తుందని మెసేజ్ రాగానే ఆత్రుత పడి ఆ లింక్ ని ఓపెన్ చేస్తున్నారు. లింక్ ఓపెన్ రచేయగానే  వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం దొంగలిస్తున్నారు  కేటుగాళ్లు. 

 

 దీంతో వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకు ఖాతాల వివరాలు కూడా పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. దీంతో క్షణాల్లో బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు టిక్ టాక్ పేరుతో వస్తున్న వినతి లకు స్పందించవద్దని.. తొందరపడి వాళ్ళ ఎర కి చిక్కారో  ఖాతాలు ఖాళీ అయిపోతాయి అంటూ హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం టిక్ టాక్ మీద ఆధారపడిన ఎంతోమంది సెలబ్రిటీలు.. యువత అందరూ టిక్టాక్ మళ్ళీ వస్తే బాగుండు అనుకుంటున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు ఇలాంటి కొత్త ఎరను మోసం చేయడానికి సిద్ధం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: