తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో మీడియో సమావేశం ద్వారా ఇంకొన్ని రోజుల్లో రైతులకు శుభవార్త చెబుతానంటూ చెప్పి ఆ తర్వాత ఎక్కడ తెరమీద కనిపించలేదు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఆరోగ్యం ఎలా ఉంది... ప్రస్తుతం ఆయన ఎందుకు ఫామ్ హౌస్ లోనే ఉండి పోయారు... ఎందుకు అక్కడ నుంచి పాలన సాగిస్తున్నారు... అన్నది ప్రస్తుతం ఎంతో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం గురించి బయటకి చెప్పాలి అంటూ ఎంతో మంది టీఆర్ఎస్ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, 

 


 ఇదిలా ఉంటే తాజాగా కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో వెల్లడించాలి అంటూ తెలంగాణ హైకోర్టులో మాండమస్ పిటిషన్ దాఖలైంది. నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు, ప్రగతిభవన్లో 30 మందికి కరోనా పాజిటివ్ అని వచ్చిందని.. అటు వెంటనే  ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లారని పిటిషన్లో పేర్కొన్నారు మల్లన్న. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ నుంచి పాలన సాగిస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది అంటూ పిటిషన్లో పేర్కొన్నారు మల్లన్న. కెసిఆర్ ఆరోగ్యం గురించి తెలంగాణ ప్రజలు  అయోమయంలో ఉన్నారు  అంటూ తెలిపారు. 

 

 ఎలాగో ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు అందుబాటులో లేరు అనే ఉద్దేశంతో ఆయా శాఖల అధికారులు కూడా సక్రమంగా పనిచేయడం లేదు అంటూ ఆరోపించారు. గత నెల రోజుల నుంచి కేసీఆర్ ఎక్కడ తెరమీద కనిపించకపోవడంతో... ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని ప్రజలు అందరూ అయోమయంలో ఉన్నారని అందుకే కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో  అనే విషయాలు బయటకు తెలపాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కరోనా  వైరస్ కట్టడి చేయడంలో భాగంగా ఎన్నోసార్లు ప్రెస్మీట్లు పెట్టి ప్రజలకు ధైర్యం చెప్పిన కెసిఆర్ ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్లి పోయారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్యంపై ప్రతిపక్ష పార్టీలు కూడా తమదైన శైలిలో ఆరోపణలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: