దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా దేశంలో చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. దింతో దేశంలో దేశ ప్రజలకు అండగా నిలిచేందుకు కొన్ని బ్యాంకులు కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి.

 

 

దేశంలో అతి పెద్ద బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బ్యాంక్ కస్టమర్లకు తీపి కబురును అందజేశారు. అయితే రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడంతో బ్యాంక్ లో లోన్ తీసుకున్న వారికి ప్రయోజనం చేకూరనుందని యాజమాన్యం తెలియజేశారు. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్ట్ లెండింగ్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించిందని సమాచారం.

 

 

బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును 5-10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ రేట్ల తగ్గింపు నిర్ణయం జూలై 10 నుంచి అమలులోకి వస్తుందని తెలిపిందని అధికారులు తెలియజేశారు. రేట్ల కోత నిర్ణయంతో బ్యాంక్ 3 నెలల రేటు 6.65 శాతానికి దిగొచ్చిందని తెలిపారు. దీంతో బ్యాంక్ రేట్లను ఇప్పటికి 14వ సారి తగ్గించిందని యాజమాన్యం పేర్కొన్నారు.

 

 


రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ రేటు తగ్గించిన విషయం తెలిసిందే. 20 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించిందన్నారు. ఈ నిర్ణయంతో హోమ్ లోన్ తీసుకున్న వారికి ప్రమోజనం చేకూరనుందని తెలియజేశారు.

 

 

రుణ రేట్లు దిగిరావడంతో ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది.  తాజా రేట్ల కోత నిర్ణయంతో రాత్రికి రాత్రే ఎంసీఎల్ఆర్ 7.1 శాతానికి పడిపోయింది.  నెలవారీ ఈ రేట్లు 7.15 శాతంగా, 3నెలల ఎంసీఎల్ఆర్ 7.2 శాతంగా, 6నెలల ఎంసీఎల్ఆర్ 7.3 శాతంగా, ఏడాది ఎంసీఎల్ఆర్ 7.45 శాతంగా, 2,3 ఏళ్ల ఎంసీఎల్ఆర్ 7.45, 7.65 శాతంగా ఉన్నాయని యాజమాన్యం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: