యువతను మత్తులో చిత్తుగా ముంచి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా కొంత మంది కేటుగాళ్ళు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎన్ని గంజాయి తోటలు నాశనం చేసినా, ఎన్ని వాహనాల్లో పట్టుకున్నా రోజూ ఎక్కడోచోట గంజాయి రవాణా అవుతూనే ఉంది. తాజాగా గోదావరి జిల్లా బుర్రిలంక ఇసుకర్యాంపు విశాఖ ఏజెన్సీ ప్రాంతం ధారకొండ నుంచి ఇతర రాష్ట్రాలకు లారీలో తరలిస్తున్న 1,200 కిలోల గంజాయిని కేడీపేట పోలీసులు పట్టుకున్నారు. గొలుగొండ మండలం లింగంపేట వద్ద రోజు వారీ విధుల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయితో రవాణా అవుతున్న లారీని పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. లింగంపేట వద్ద రోజు వారీ విధుల్లో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయిని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. 

 

పోలీసులు ఎన్ని సార్లు ఈ దుండగులను పట్టుకుంటున్నా.. మళ్లీ మళ్లీ అదే పని చేస్తూ పట్టుబడుతున్నారు. ప్రధానంగా ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు ఇదే సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. పోలీసు అధికారులు వీటిని తొలగించేందుకు ప్రధాన రోడ్డకు అనుకుని ఉన్న ప్రాంతాలనే ఎంపిక చేసుకుంటారు. ఇలాంటి రహదారుల్లో పోలీసుల నుంచి తప్పించుకోవొచ్చు అన్న దీమా వాళ్లకు ఉంటుంది. 

 

అందువల్ల వేల ఎకరాల్లో తోటలు నాశనం చేసినట్టు అధికారులు ప్రకటించుకున్నా నిత్యం గంజాయి రవాణా అవుతూనే ఉంటుంది.  పట్టుబడిన గంజాయి విలువ రూ.60 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులతో పాటు 2 సెల్ ఫోన్లు, లారీని స్వాధీనం తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేడీపేట ఎస్ఐ భీమరాజు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: