ప్రేమ ఇద్దరి మనసులను ఒక్కటి చేసింది. ఇద్దరికి ఒక్కరి అంటే ఒక్కరికి చాల ఇష్టం. ఇద్దరు ఒక్కరి కోసం ఒక్కరు పుట్టరేమో అన్నటుగా ఉన్నారు. ప్రేమ ఎంత మధురమైందో కొన్ని ప్రేమ జంటలను చుస్తే తెలిసిపోతుంది. దేశంలో ప్రేమ కోసం తాజమహల్ కట్టించిన వారు ఉన్నారు. అదే ప్రేమ కోసం నగరాన్ని నిర్మించిన వారు ఉన్నారు. వారి ప్రేమను గెలిపించుకొని సంతోషంగా ఉన్నవారు ఉన్నారు. ప్రేమ కోసం ప్రాణాలను వదిలేసిన జంటలు ఉన్నారు. వారిద్దరు ఒక్కరిని ఒక్కరు ఇష్టపడ్డారు. వారి ప్రేమకు కులం అడ్డువచ్చింది. వారి ప్రేమను ఎలాగో గెలిపించుకోమని తెలిసిన ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.

 

 

వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. కోరుట్ల మండలం ఇబ్రహీంపట్నానికి చెందిన గుండేటి రమ్య (22), మండలోజి ప్రణీత్‌చారి(22) రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి కులం వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అడ్డు చెప్పారు. దీనికి తోడు రమ్యకు ఇటీవలే మరొక యువకుడితో తల్లిదండ్రలు వివాహం నిశ్చయించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను ప్రణీత్‌నే పెళ్లి చేసుకుంటానని రమ్య చెప్పినా కుటుంబ సభ్యులు వినిపించుకోలేదని వాపోయారు.

 

 

దీంతో వారు కలిసి బ్రతకలేకపోతున్న తాము... కలిసైనా చావాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. వీరిద్దరూ గ్రామ శివారులో పురుగుల మందు తాగారు. అనంతరం ఇద్దరూ కలిసి చెట్టుకు ఉరేసుకున్నారు.

 

 

అయితే తాడు తెగడంతో రమ్య కింద పడిపోగా.. ప్రణీత్‌చారి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో భయపడిన ఆమె వెంటనే తన తండ్రి లక్ష్మణ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని రమ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయిందన్నారు. ఇరుకుటుంబాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: