ఈ ఏడాది ఏం పాపం చేశారో కానీ ప్రజలు అటు ప్రకృతి.. ఇటు కరోనా వైరస్ తో అల్లకల్లోలం అవుతున్నారు.  ప్రాణ నష్టమే కాదు ఆర్థికంగా కుంగిపోతున్నారు. గుజరాత్ ‌లో కరోనా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఇక దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడులో ఎక్కువగా నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఇక గుజరాత్ లో కూడా కేసులు బాగానే పెరిగిపోతున్నాయని అంటున్నారు.  మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు మరోవైపు పాకిస్థాన్ నుంచి వస్తున్న మిడతల దండుతో పంట నష్టం భారీగా అవుతుంది.  గుజరాత్ లో వలస కార్మికుల కార‌ణంగా క‌రోనా వ్యాప్తి చెందుతున్న‌ద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

IHG

గుజరాత్ ‌లో ఆదివారానికి మొత్తం 36,191 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 1,963 కు చేరుకుంది. అయితే ఇక్కడ  రికవరీ రేటు బాగానే ఉంద‌ని అంటున్నారు.  ఓ వైపు కరోనాతోనే చచ్చిపోతున్నామంటే ఇప్పుడ వరుణుడు ఉగ్ర రూపం దాల్చుతున్నాడు.  వరుస వర్షాలతో గుజరాత్‌లోని కొన్ని జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. అక్కడ గత మూడు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే పలు జిల్లాలు నీటమునిగాయి. రోడ్లపైన భారీగా వరద నిలువడంతో చాలా చోట్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

IHG

జనం ఇండ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.  కరెంట్ పోల్స్ విరిగిపోయాయి.. చాలా మంది ప్రజలు అందకారంలో బతుకు ఈడ్చుతున్నారు. అయితే వర్షాల కారణంగా ప్రజలకు అసౌకర్యం ఏర్పడటంతో మున్సిపల్‌ సిబ్బంది రెండు రోజుల నుంచి సహాయక చర్యలు చేపడుతున్నా రోడ్లపై నీళ్లు పోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వర్షాలు తగ్గితే కాని పరిస్థితి కుదుటపడకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా మూడో రోజు కూడా భారీ వర్షాలు కురవడంతో గత రెండు రోజుల్లో సౌరాష్ట్రలోని లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 1,000 మందికి పైగా ఇతర ప్రదేశాలకు తరలి వెళ్లినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: