ప్రజా గాయకుడు..  తెలంగాణలో ఉద్యమ గాయకుడిగా పేరు ప్రఖ్యాతులు అందుకున్న జన గాయకుడు నిస్సార్ కరోనాతో కన్నుమూశారు.  ప్రజల కష్టసుఖాలను, తెలంగాణ గుండెచప్పుళ్లను తన పాటలతో ఎలుగెత్తి చాటిన ప్రముఖ తెలుగు కవి, గాయకుడు నిసార్ మహమ్మద్ ఇకలేరన్న విషయం పై మంత్రి హరీశ్ రావు ఆవేదనకు లోనయ్యారు. తెలంగాణ పాటను సారవంతం చేసిన కళాకారుడు నిస్సార్ అని కీర్తించారు. 'ఆర్టీసీ కండక్టర్ గా పనిచేసిన నిస్సార్ తన పాటల ప్రయాణాన్ని అర్థాంతరంగా ఆపేసిండు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా ఉద్యమ చైతన్యాన్ని ఆవాహన చేసుకున్న నిస్సార్.. అంటూ సోషల్ మాద్యమంలో స్పందించారు.

IHG

పేద ముస్లిం కుటుంబంలో జన్మించిన అతను అనేక ఉద్యమాలకు పాటల ప్రాణవాయువునిచ్చాడని కొనియాడారు.  ప్రపంచీకరణ మాయలో కరిగిపోతున్న తెలంగాణ జానపద సాంస్కృతిక కళారూపాలను తలపోస్తూ వలపోసిన వాగ్గేయకారుడు అని హరీశ్ రావు అభివర్ణించారు. కడవరకు కూడా ఆయన ప్రజల కోసమే పరితపించారని అన్నారు.  కరోనా విలయంపై పాట రాసి ఆలపించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నిసార్ స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల. చిన్నప్పటి నుంచి ఆయన సమాజం గురించి ఆలోచించేవారు.

 

ప్రజానాట్యమండలి సభ్యుడైన ఆయన ప్రజలను వేధిస్తున్న సమస్యలపై పాటు రాసి పాడారు.  ఉద్యమ సమయంలోనే కాదు.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన అనేక నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. నిసార్ మృతిని సాంస్కృతిక రంగానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటు అని ప్రజాసంఘాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: