కరోనా సోకిన వారు ఐసోలేషన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చాలా మంది ఆ నిబంధనలను పాటించడం లేదు. ఇటీవల ఓ వ్యక్తి ఐసోలేషన్‌కు వెళ్లేందుకు ఇష్టం లేక పోలీసులతోనే ఫైటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. కొంత మందికి క్వారంటైన్ అంటే అదో జైలు శిక్షగా ఫీల్ అవుతున్నారు.. కానీ క్వారంటైన్ లో ఉంటేనే తమ ప్రాణాలు కాపాడుకోగలుగుతారని వైద్యులు చెబుతున్నారు. తాజాగా బల్రాంపూర్ జిల్లాలోని డిండో వద్ద ఉన్న క్వారంటైన్ కేంద్రం నుంచి 14 మంది వలసదారులు తప్పించుకున్నారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి పరారైన వారిలో నుంచి ఐదుగురుని తిరిగి క్వారంటైన్ కేంద్రానికి తీసుకువచ్చారు. ఇక మరికొంత మంది గురించి ఇంకా గాలింపు జరుగుతూనే ఉంది.

 

అయితే పరారీలో ఉన్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన అధికారులు.. వారు కేంద్రానికి తిరిగి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. కరోనా వైరస్ కు గురైన వారిని క్వారంటైన్ చేసేందుకు గ్రామ పంచాయతీ దిండోలోని హాస్టల్‌ను కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఈ కేంద్రానికి కాపలాగా పోలీసు సిబ్బందితో పాటు కాపలాదారును కూడా ఏర్పాటుచేశారు. అయితే, పాజిటివ్ వచ్చిన 10 మంది వలసదారులను కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ 19 మంది వలసదారులు నివసిస్తున్నారు. ఇటీవల ఓ వలసదారుడు తప్పించుకుని పారిపోయాడు. బుధవారం మరో పదకొండు మంది తప్పించుకున్నారు.

 

తప్పించుకున్న వారి వల్ల ఏదైనా ప్రమాదం జరగవొచ్చు అని వారితో సంప్రదింపులు జరుపుతున్నారు.. మీ వల్ల ఇతరులకు వచ్చే ప్రమాదం ఉందని.. అధికారులకు సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే.. మొత్తం 11 మంది వలసదారులపై త్రికుండ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పరారైన ఐదుగురిని గుర్తించి తిరిగి క్వారంటైన్ కేంద్రానికి తీసుకురాగలిగారు. ప్రస్తుతం అక్కడ 10 మంది వలసదారులు నివసిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: