తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాముఖ్యతను సంపాదించుకున్న అప్లికేషన్లలో టిక్ టాక్ ఒకటి. అయితే చైనా భారత్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఇతర కారణాల వల్ల భారత్ టిక్ టాక్ తో సహా 59 యాప్ లపై నిషేధం విధించింది. భారత్ లో దాదాపు 30 కోట్ల మంది టిక్ టాక్ యాప్ ను వినియోగించేవాళ్లని ఒక అంచనా. భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల చైనాకు వేల కోట్ల రూపాయల నష్టం కలుగుతోంది. 
 
టిక్ టాక్ కంపెనీ ఇప్పటికీ తమ కంపెనీ సర్వర్లన్నీ సింగపూర్ లో ఉన్నాయని నిషేధం తొలగించాలని వేడుకుంటున్నాయి. హాంగ్ కాంగ్ నుంచి టిక్ టాక్ విత్ డ్రా అయింది. హాంగ్ కాంగ్ ప్రజలు చైనా సర్కార్ పై తిరగబడుతూ ఉండటం.... అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో టిక్ టాక్ స్వచ్ఛందంగా విత్ డ్రా అయింది. తాజాగా అమెరికా కూడా టిక్ టాక్ ను నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. 
 
అమెరికా దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తాజాగా అమెరికన్ల వ్యక్తిగత సమాచారం చైనా కమ్యూనిస్టు పార్టీ చేతుల్లోకి వెళ్లాలనులనే వాళ్లు టిక్ టాక్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనా దేశాల మధ్య క్యూరిటీ, వాణిజ్యం, టెక్నాలజీ వంటి వాటితో సహా వివిధ రంగాల్లో తీవ్ర విభేదాలు ఉన్నాయి. అమెరికా చైనాకు సంబంధించిన వాణిజ్య టారిఫ్ విషయంలో కూడా విభేదిస్తూ ఉండటం గమనార్హం. 
 
అమెరికా టిక్ టాక్ ను నిషేధిస్తే మాత్రం 60 శాతం ఆదాయం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల నుంచి వెళ్లి చైనాలో పరిశ్రమలు పెట్టిన వాళ్లు సైతం తమ ఉత్పత్తుల భవిష్యత్తు విషయంలో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చైనాకు భవిష్యత్తులో మరిన్ని దేశాల నుంచి వరుస షాకులు తగిలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: