భారత అంతర్గత వ్యవహారాల గురించి పదే పదే మాట్లాడే పాకిస్తాన్..  ‘ఉగ్రవాదుల స్వర్గధామం’గా ఎందుకు పేరుపొందిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత్‌ హితవు పలికింది.మానవ హక్కుల గురించి తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని పాకిస్థాన్‌కు గట్టిగా జవాబిచ్చింది భారత్. పాకిస్థాన్ ఓ విఫల రాష్ట్రమని, ఆ దేశం మాకు నీతులు చెప్పాల్సిన పనిలేదని భారత్ తెలిపింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే దాయాది దేశం మాత్రం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడింది. తమ భూభాగం నుంచి ఉగ్రవాదులను వెళ్లగొట్టేలా అంతర్జాతీయ సమాజం పాక్‌కు పిలునివ్వాలని విజ్ఞప్తి చేసింది. భారత్‌ వైపు వేళ్లు చూపుతూ... ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై విషం చిమ్మడం మానేసి తమ దేశంలో ఏం జరుగుతుందో చూసుకుంటే బాగుంటుందని ఘాటుగా విమర్శించారు. 


ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న వర్చువల్‌ ‘కౌంటర్‌- టెర్రరిజం’ వీక్‌లో భాగంగా.. ‘‘ప్రపంచానికి శాపంగా పరిణమించిన ఉగ్రవాదం: మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు, పెచ్చు మీరుతున్న తీవ్రవాదం మరియు విద్వేష ప్రసంగాలు, ట్రెండ్స్‌’’ అనే టాపిక్‌పై వెబినార్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా భారత ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించిన మహవీర్‌ సింఘ్వీ భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న పాకిస్తాన్‌కు ఈ మేరకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. భారత్‌ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం అందరికీ అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. 


భారత్‌ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం అందరికీ అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. అన్నిమతాల వారికి భారత్‌లో సముచిత స్థానం లభిస్తుందని.. దేశ రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యున్నత పదవుల్లో వారు పనిచేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. లష్కర్‌, జైషే వంటి ఉగ్ర సంస్థలకు ఆశ్రయం కల్పిస్తూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ అమెరికా  పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత‌ర్జాతీయంగా అబాసుపాలవుతున్న పాకిస్తాన్ పాల‌కుల్లో మాత్రం మార్పు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: