మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి నేడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓ పండగల జరుపుతోంది. ఆయన అభిమానులతో సహా, రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పిస్తున్నారు. ఇదే నేపథ్యంలో టాలీవుడ్ రచయిత, దర్శకుడు, నిర్మాత అయిన కోన వెంకట్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు. ఇక ఆయన పోస్ట్ పరంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో ఓ సారి తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన వివరణాత్మకంగా తెలియజేశారు. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చమత్కారం చాలా ఎక్కువ అని అందరికీ తెలిసిన విషయమే.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

రాజశేఖర్ రెడ్డి గారు సి.ఎం గా ఉన్నప్పుడు ఒకసారి చెన్నై నుండి వస్తుంటే ఫ్లైట్ లో కనిపించారు.. నన్ను చూడగానే గుర్తుపట్టి పిలిచి పక్కన కుర్చోపెట్టుకున్నారు .. చాలా ఆనందపడ్డాను.. నాకు ఆయనంటే చాలా ఇష్టం.. "నీ పేరు ఈ మధ్య బాగా వినపడుతుంది .. అంటే నీ కెరీర్ బాగుందన్నమాట" అన్నారు .. "థాంక్యూ సార్" అన్నాను.. "నువ్వు ఒకసారి ఇంటికి రావాలి" అన్నారు కొంచెం ఆశ్చర్యపోయాను .. "మా మేనల్లుడు ఒకడున్నాడు.. కడపలో సినిమాహాళ్లు ఉన్నాయి.. సినిమా తీస్తా అంటున్నాడు.. చాలా ఉత్సాహంగా ఉన్నాడు" అన్నారు.. (కథ ఏదన్నా ఉందా అని అడుగుతారేమో అనుకుని లోపల ఆనందపడ్డాను) "తప్పకుండా వస్తాను సార్" అన్నాను "వాడితో ఎలాగైనా ఆ సినిమా ఆలోచన మానుకోమని చెప్పాలి వెంకట్ " అన్నారు (గాలి మొత్తం దిగిపోయింది) "నువ్వు సినిమా తీసి ఎలా నష్టపోయావో వాడికి చెప్పాలి" అన్నారు. (నా మొదటి సినిమా "తోకలేని పిట్ట" ఓపెనింగ్ కి ఆయననే ముఖ్య అతిధి గా పిలిచానని గుర్తుకు వచ్చింది) ఆయన పలకరింపు లో ప్రేమ ఆయన నడకలో రాజసం ఆయన నవ్వులో స్వచ్ఛత.. ఆయనకే సొంతం .. పెద్దాయన .. We really Miss u 🙏

A post shared by Kona Venkat (@konavenkat) on

 

అయితే ఓసారి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోనవెంకట్ మద్రాసు నుండి వస్తుంటే విమానంలో ఆయన కనిపించారట. ఆయనను గుర్తు పట్టి రాజశేఖర్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆయనతో రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నీ పేరు ఈమధ్య బాగా వినపడుతుంది అంటే నీ కెరీర్ బాగుంది అని వెంకట్ తో వైయస్సార్ చమత్కరించారు. దీనితో కోన వెంకట్ థాంక్యూ సార్ అని తెలియజేశారట. ఇలా ఆయనతో జరిగిన సంభాషణ మొత్తం కోన వెంకట్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: