దేశంలో కరోనా వైరస్ కేసులు మొదలైనప్పటి నుంచి  దొంగలకు పనీ పాటా లేదని తెగ బాధపడిపోతున్నారు. గత మూడు నెలల క్రితం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూ వచ్చారు.. ఇక దొంగలకు ఎవరి ఇంట్లో కన్నం వేయాలన్నా వీలు చిక్కలేదు. మరోవైపు కరోనా భయం కూడా మొదలైంది. కొంత మంది దొంగలకు మాత్రం కరోనా కాలం భలే కలిసి వచ్చింది. చాలా మంది పట్టణాల్లో ఉంటే కరోనా వ్యాప్తి బాగా ఎక్కువ అవుతుందని.. గ్రామాలకు తరలి వెళ్లారు. ఇళ్లకు తాళాలు వేయడంతో కన్నాలు బాగానే వేశారు దొంగలు. అయితే ఇప్పుడు కొంత మంది దొంగలు కరోనాని బాగానే ఉపయోగించుకుంటున్నారు.  దొంగతనాలకు వెళ్లాలంటో ముసు వేసుకోవడమో.. మాస్క్ పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. 

 

ఇప్పుడు పోలీసులకు ఏ మాత్రం చిక్కే అవకాశం లేకుండా చాకచక్యంగా దోపిడీకి పాల్పడ్డారు. కరోనా నుంచి రక్షణ పొందడానికి డాక్టర్లు వాడే పీపీఈ సూట్ ధరించి తెలివిగా జూవెల్లరీ షాపులో దొంగతనం చేశారు. ఏకంగా 780 గ్రాముల బంగారం లూఠీ చేశారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆదివార ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వాళ్ల దొంగ తెలివికి అంతా ఆశ్చర్యపోతున్నారు.  తాజాగా ఓ దొంగల ముఠా  బంగారం షాపులోకి చొరబడింది. తమను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటానికి పీపీఈ కిట్ ధరించి, ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌసులు వేసుకున్నారు.

 

నైట్ సీసీ కెమెరాలో చిక్కిన ఫోటోలో చూసి షాప్ యజమాని ఖంగు తిన్నాడు.  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాదారణంగా  దొంగతానికి వెళ్లే ముందు చాలా మంది మొఖానికి మాస్కులు పెట్టుకొని ఎవరైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తే జారిపోయేలా ఆయిల్ రాసుకోవడమో చూసి ఉంటాం. కానీ కాలం మారడంతో దానికి అనుగుణంగా ఈ కేటుగాళ్లకు కరోనాని బాగానే ఉపయోగించుకున్నారని నెటిజన్లు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: