దేశాలందు చైనా దేశం ప్రత్యేకం. చౌకగా లభించే ఉత్పత్తులతో పాటు వివాదాలకు డ్రాగన్ పెట్టింది పేరు. ఒక కిలోమీటర్ వెనక్కు వెళ్లి రెండు కిలోమీటర్లు ముందుకు వచ్చి భూభాగాన్ని ఆక్రమించే దుర్భుద్ధి చైనాకు సొంతం. ప్రపంచంలో ఏ దేశం ఈ తరహా కుట్రలకు పాల్పడదు. చివరకు వైరస్ ల ద్వారా చైనా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తూ శత్రు దేశాలను పెంచుకుంటూ ఏకాకి దేశంగా మిగిలే పరిస్థితిని తెచ్చుకుంటోంది. 
 
తాజాగా భారత సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్ వ్యాలీ నుంచి చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. చైనా ప్రభుత్వ మీడియా సంస్థ నుంచి ఈ మేరకు కొన్ని శాటిలైట్ చిత్రాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఆర్మీ అధికారులు మాత్రం ఫోటోలను ధృవీకరించాల్సి ఉందని చెబుతున్నారు. అయితే వెనక్కు వెళ్లినా చైనా నాటకం కొనసాగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చైనా సైన్యం రెండు కిలోమీటర్ల మేర వెనక్కు పోయినా ఫింగర్ 4, 5 మధ్యలోనే డ్రాగన్ సైన్యం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అక్కడ చైనా సైన్యం 190 తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసుకున్నాయని సమాచారం. ఆ శిబిరాలను తొలగించాలని భారత్ చెబుతున్నా చైనా మాత్రం వాటిని తొలగించట్లేదు. చైనా భారత్ ఏ మాత్రం నిర్లిప్తంగా ఉన్నా ఆ ప్రాంతాలను ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. అమెరికా కూడా దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ నౌకలను అలాగే ఉంచింది. అమెరికా, భారత్ చైనాను నమ్మే పరిస్థితిలో లేవు. 
 
గత అనుభవాల దృష్ట్యా భారత్ చైనా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. భారత్ మరికొన్ని రోజులు సైనికులను మోహరించాల్సిందేనని.... ఫింగర్ 8 దగ్గరకు చైనా సైనికులు వెళ్లకపోతే మాత్రం డ్రాగన్ డబుల్ గేమ్ ఆడుతున్నట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ చైనాను నమ్మాల్సిన అవసరం ఐతే లేదు.          

మరింత సమాచారం తెలుసుకోండి: