సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ల మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. 8 కోట్ల మంది డిజిటల్ 'సైనికులు' ఉన్న ట్రంప్​తో కేవలం 64 లక్షల సైన్యంతో 'ట్విట్టర్' రణక్షేత్రంలో తలపడుతున్నారు బైడెన్. ఇదేకాక ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ వీరిద్దరి ఫాలోవర్ల మధ్య అంతరం భారీగా ఉంది.
దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్​బుక్​లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకు సగటున 14 పోస్టులు పెడుతున్నారు. ఆయనకు ఫేస్​బుక్​లో 28 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థి జో బైడెన్​కు ఫేస్​బుక్​లో 2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. సగటున ఏడు పోస్టులు చేస్తున్నారు. ట్విట్టర్​లో ట్రంప్​ 82.4 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉండగా.. బైడెన్ కేవలం 6.4 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు.అంతేగాక గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ సైన్యాన్ని భారీగా పెంచుకున్నారు ట్రంప్. వీరంతా తమ క్యాంపెయిన్ మెసేజ్​లను వందలసార్లు రీట్వీట్ చేస్తున్నారు. గూగుల్, యూట్యూబ్ ప్రకటనల్లోనూ ట్రంప్ దూసుకెళ్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యేందుకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో డిజిటల్ ప్రపంచంలో ఇలాంటి మద్దతు ఉండటం ట్రంప్​నకు కాస్త ఉరటనిచ్చే అంశం.

 

తన మద్దతుదారులతో నిరంతరం సంభాషించడం, నిరుద్యోగం, జాతి వివక్ష, కరోనా విషయంలో తన దుర్బలత్వాన్ని విస్మరించే సందేశమివ్వడానికి ఇది భారీ వేదికలా అధ్యక్షుడికి ఉపయోగపడుతోంది.ప్రస్తుతం బైడెన్ సైతం తన 'సామాజిక' శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఫేస్​బుక్ ప్రకటనలపై భారీగా ఖర్చు చేస్తున్నారు. జూన్​ నెలలో తొలిసారి ట్రంప్​తో పోలిస్తే రెట్టింపు డబ్బును ఖర్చుచేశారు. ఇన్​స్టాగ్రామ్​ మద్దతుదారులను నియమించుకొని ఆన్​లైన్ ఫండ్​రైజింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ట్రంప్​కు ట్విట్టర్ వరుస షాకులిస్తోంది. మెయిల్-ఇన్ ఓటింగ్​ వల్ల మోసాలు పెరుగుతాయన్న ట్వీట్​కు ఫ్యాక్ట్​చెక్ జత చేసింది. ఓ మానిప్యులేటెడ్ వీడియోను పోస్ట్ చేసినందుకు వినియోగదారులను అప్రమత్తం చేసింది.

 

మినియాపొలిస్​లో లూఠీలు చేసేవారిని కాల్చేస్తామని హెచ్చరించిన ట్వీట్​ను హైడ్ చేసింది.ట్రంప్​కు వ్యతిరేకంగా ట్విట్టర్ కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫేస్​బుక్​పై ప్రభావం పడింది. సంస్థలో నుంచి చాలా కంపెనీలు పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల ఫేస్​బుక్​పై ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో నియమాలకు విరుద్ధంగా ట్రంప్ పోస్టులు చేస్తే చర్యలు తీసుకుంటామని ఫేస్​బుక్ ప్రకటించింది.స్నాప్​చాట్ సైతం ట్రంప్​ ప్రొఫైల్​పై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడి ఖాతాను యాక్టివ్​గా ఉంచుతూనే ఎక్కువ ప్రదర్శించకుండా ఉంచనున్నట్లు గతనెలలో ప్రకటించింది. విద్వేష ప్రసంగాలు, హింసాత్మక కామెంట్లకు చెక్​పెడుతూ రెడిట్ సంస్థ ట్రంప్ అనుచరుల ఖాతా 'ది_డొనాల్డ్'​ను నిషేధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: