కరోనా వైరస్ లాక్ డౌన్ లో విశాఖపట్టణంలో ఎల్ జి గ్యాస్ లీకేజీ ఘటన జరిగి రెండు నెలలు అయింది. జరిగిన ఈ ఘటనలో 12 మంది చనిపోగా వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. ఆ టైంలో ఏపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయినా కానీ రెండు మూడు సార్లు మళ్లీ గ్యాస్ లీక్ అయ్యే పరిస్థితి ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి కంపెనీ పై గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన టైంలో పెద్దగా చర్యలు తీసుకోలేదు. పైగా జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కమిటీ వేయడం జరిగింది. ఎవరి వల్ల ఈ దుర్ఘటన జరిగింది అన్న దాని విషయంలో రెండు నెలలు రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి ఇటీవల నివేదికను సీఎం వైఎస్ జగన్ కి అందించారు. జరిగిన దుర్ఘటనలో యాజమాన్యం వల్లే ఇంత నష్టం జరిగిందని రిపోర్టు వచ్చింది.

 

దీంతో రిపోర్ట్ వచ్చిన వెంటనే ఎల్జీ పాలిమర్స్ ఎండీ సహా పదకొండు మందిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. కాగా ఇప్పుడు ఎల్జి పాలిమర్స్ యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముందుగానే ఈ విషయాన్ని చెప్పటం జరిగింది. అప్పుడు అదుపులోకి తీసుకోకుండా ఇంత లేట్ చేయటం ఏంటి అని గ్యాస్ లీక్ ఘటనకు గురైన బాధిత సంబంధిత గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎల్జి పాలిమర్స్ అరెస్టులపై విమర్శలు చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా పూర్తిగా ఎల్జి పాలిమర్స్ కంపెనీని అక్కడ నుండి తరలించాలని ఎండి తో పాటు ఇతరుల పై పెట్టిన కేసులు చాలా తీవ్రంగా ఉండాలని కంపెనీ చుట్టుప్రక్కల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వాళ్లకి వేసే శిక్ష రాష్ట్రంలో వేరే పరిశ్రమల యాజమాన్యాలు తప్పులు చేయకుండా ఉండేలా అంత కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: