చంద్రబాబు రాజధాని అమరావతి ప్రాంతంలో ఐనవోలు గ్రామం దగ్గర దాదాపు 100 ఎకరాల అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయాలని శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా అంబేద్కర్ స్మృతివనం కోసం దాదాపు 100 కోట్లు టీడీపీ కేటాయించడం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో అంబేద్కర్ స్మృతివనం కి సంబంధించి పనులను నిలిపివేసింది. అంతేకాకుండా ఐనవోలు దగ్గరినుండి అంబేద్కర్ స్మృతివనం ని విజయవాడ ప్రాంతంలో భూ వివాదాల్లో ఇరుక్కున్న ఉన్న స్వరాజ్ మైదానం దగ్గరికి మార్చడం జరిగింది. ఈ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తో పాటు మెమోరియల్ పార్కు నిర్మించడానికి వైసీపీ సర్కార్ తాజాగా రెడీ అయింది.

 

ఇదిలా ఉండగా అంబేద్కర్ విగ్రహం తరలింపు వెనకాల సరికొత్త రాజకీయం ఉందని ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. వినబడుతున్న వార్తల ప్రకారం స్వరాజ్ మైదానం భూ వివాదంలో టీడీపీ పార్టీకి చెందిన నాయకుల పేర్లు ఉన్నట్లు… దాంతో వారికి చెక్ పెట్టడానికి వైయస్ జగన్ సర్కార్ ఐనవోలు ఉండాల్సిన అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి ఆపితే కనుక తెలుగుదేశం పార్టీ దళిత వ్యతిరేక పార్టీ ముద్ర పడుతుంది.

 

ఆ దిశగా వైసీపీ నాయకులు ప్లాన్ వేసి కావాలని ఐనవోలు లో నిర్మాణం కావాల్సిన అంబేద్కర్ స్మృతివనం ని స్వరాజ్ మైదానం లోకి మార్చినట్లు ఏపీ రాజకీయాలో వార్తలు వినబడుతున్నాయి. గతంలోనే చంద్రబాబు దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ దిశగా… వైసీపీ ప్రభుత్వం ఆలోచించి ఒకవేళ ఈ అంబేద్కర్ విగ్రహ కార్యక్రమం ఉద్దేశపూర్వకంగా టీడీపీ అడ్డుకుంటే గనుక పూర్తిగా టీడీపీ దళిత వ్యతిరేక పార్టీ ముద్ర పడుతుందని అంబేద్కర్ విగ్రహం వెనుక వైసీపీ సరికొత్త రాజకీయ ఎత్తుగడ వేసినట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: