లేనిపోని హంగులు...హడావిడి ప్రచారాలు....టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జరిగిన కార్యక్రమాలు ఇవే. చేసే పని తక్కువ, హడావిడి ఎక్కువ. ప్రతి విషయంలోనూ ఇదే జరిగింది. ఆఖరికి ఆయన కేబినెట్ సమావేశం పెట్టుకున్న కూడా హడావిడి కోసం అనవసరమైన ఖర్చు చాలానే చేశారు. ఇక విదేశాల టూర్ల పేరిట ఎంత వేస్ట్ చేశారో చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా సింగపూర్ లాంటి రాజధాని అని చెప్పి, అమరావతి పేరిట చేసిన వృధా ఖర్చు చాలానే ఉంది.

 

ఇక చేసిన పని తక్కువైన సరే...దాన్ని ఎక్కువ చేసి చూపించుకోవడానికి పత్రికలకు, మీడియాకు ఇచ్చిన ప్రకటనల ఖర్చు చాలానే అయింది. పత్రికల ద్వారా చేసిన ప్రచార హడావిడి అంతా ఇంతా కాదు. అయితే ఇదే విషయాన్ని హైలైట్ చేసి, ఎన్నికల్లో వైసీపీ ఎక్కువగానే లబ్ది పొందింది. ఆఖరికి చంద్రబాబు వాడిన హిమాలయ వాటర్ బాటిల్స్‌ని సైతం వైసీపీ శ్రేణులు ప్రచారం చేసి, టీడీపీని నెగిటివ్ చేశారు.

 

సోషల్ మీడియాలో టీడీపీ చేసిన హడావిడి ప్రచారాలని హైలైట్ చేసి వైసీపీ శ్రేణులు జగన్‌కు ఫుల్ అడ్వాంటేజ్ వచ్చేలా చేశారు. అయితే ఇప్పుడు రివర్స్‌లో టీడీపీ శ్రేణులు జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, తాను అమలు చేసే పథకాలకు సంబంధించి, పేపర్ ప్రకటనలు చాలానే ఇస్తున్నారు. ఆఖరికి టీడీపీ అనుకూల పత్రిక అని చెప్పే ఈనాడుకు సైతం జగన్ ప్రకటనలు ఇచ్చారు.

 

అయితే ఈ ప్రకటనలకు జగన్ భారీగానే ఖర్చులు చేస్తున్నారని తెదేపా నాయకులు ప్రచారం చేస్తున్నారు. గతంలో వైసీపీ నాయకులు చంద్రబాబు చేసిన ప్రచార హడావిడి గురించి విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు వారు చెప్పిన మాటలనే రివర్స్‌లో జగన్‌కు అనునయిస్తూ..టీడీపీ శ్రేణులు ఏకీపారేస్తున్నారు. మొత్తానికైతే అప్పుడు బాబు చేసిన తప్పునే జగన్ రిపీట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: