చంద్రబాబు రాజకీయ గండర గండడు. ఆయన చాణక్య నీతికి ఎవరైనా బలాదూర్. బాబు ఉమ్మడి ఏపీ సీఎం గా తొమ్మిదేళ్ళు, విభజన ఏపీకి అయిదేళ్ల పాటు ఏలికగా పనిచేశారు. చంద్రబాబు ముందు ఎందరో ఉద్దండులైన రాజకీయ నేతలు ఓడిపోయి వాడిపోయారు. అటువంటి చంద్రబాబు ఇపుడు యువ నేత జగన్ ముందు మాత్రం వీగిపోతున్నారు.

 

ఇప్పటికే దళిత ఓటు బ్యాంక్ ని పూర్తిగా వైసీపీ పట్టేసింది. నిజానికి దళితులు, మైనారిటీలు కాంగ్రెస్ ఓటు బ్యాంక్. కాంగ్రెస్ ఎన్ని ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఈ రెండు సామాజికవర్గాలు ఆ పార్టీని అట్టేబెట్టుకుని ఉండడం వల్ల కాంగ్రెస్ కి 30 శాతం కంటే తక్కువ ఓట్లు ఎపుడూ రాలేదు. అయితే విభజన తరువాత ఒడుపుగా ఏ వర్గాల ఓట్లను వైసీపీ కొల్లగొట్టింది. అంతే కాదు, వాటిని పటిష్టం చేసుకుని మిగిలిన వర్గాలకు గాలం వేసి 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

 

నిజానికి చాలా కాలంగా ఏ వర్గం ఓట్లు టీడీపీకి తగ్గుతున్నాయి. అయితే తనదైన మ్యాజిక్ చేస్తూ ఎంతో కొంత ఓట్ల శాతాన్ని బాబు సాధిస్తున్నారు. అంతే కాదు, జగన్ కి ఈ వర్గాలని దూరం చేస్తే తనకు అని సులువు అవుతుంది అని కూడా బాబు భావించారు. కానీ జరుగుతున్నది వేరుగా ఉంది. జగన్ శాశ్వతంగా ఈ వర్గాల మన్ననలు అందుకోవడానికి గట్టి పధకమే వేశారు.

 

విజయవాడలో 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం ద్వారా జగన్ దళితుల అండను శాశ్వతం చేసుకున్నారు. నిజానికి ఈ వర్గాలను దరి చేర్చుకోవడం కోసం బాబు సీఎంగా ఉండగా అంబేద్కర్ స్మ్రుతివనం పేరిట హడావుడి అయితే చేశారు. కానీ ఆచరణలో ఏమీ చేయలేకపోయారు. జగన్ మాత్రం రెండవ ఏడాదిలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు  రెడీ అయిపోయారు. ఎంతకాదనుకున్నా మరో రెండేళ్ళకు ఈ ప్రాజెక్ట్ సాకారం అవుతుంది. ఆ విధంగా టీడీపీకి దళితులు మళ్ళకుండా పర్మనెంట్  గా కాంక్రీట్ గోడ కట్టేసి జగన్ మొనగాడు అనిపించుకున్నారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: