ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. చైనా సైన్యం కాస్త వెనక్కి వెళ్లినప్పటికీ సరిహద్దుల్లో మాత్రం పూర్తిగా హాట్ హాట్ గానే ఉంది వాతావరణం. ఈ నేపథ్యంలో చైనా మళ్లీ నాటకాలు ఆడుతూ ముందుకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కాని సైన్యాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే లడక్ ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు లేవు అనే విషయం తెలుస్తుంది. గత పాలకుల వల్ల సరైన వంతెనలు కానీ రోడ్డు నిర్మాణాలు కానీ లేవు, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం సైన్యం మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. 

 

 తాజాగా లడక్ దగ్గర భారత సైన్యం సరికొత్త గా 3 వంతెనలు నిర్మించింది. ఓవైపు చైనా తో గొడవ పడుతూనే మరోవైపు వంతెన నిర్మాణం శరవేగం గా చేపట్టింది భారత సైన్యం. 3 వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని దాదాపుగా వంతెన నిర్మాణం పూర్తయ్యిందని సైన్యాధికారులు తెలిపారు, ప్రస్తుతం ఈ వంతెనకు అనుబంధంగా రోడ్ల నిర్మాణం ప్రక్రియ జరగాల్సి ఉంది. 70 టన్నుల బరువైన టువంటి వాహనాల భారాన్ని భరించగలిగే సామర్థ్యంతో ఈ మూడు వంతెనను నిర్మించారు.. 

 


 ఇప్పటివరకు లడక్ ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఒకవేళ సైన్యాన్ని ఆయుధాలను సరిహద్దు ప్రాంతాలకు పంపించాలంటే,, బడబడ హెలికాప్టర్లతో పనులు చేసేవారు, ఒకప్పుడు ఇలాంటి వంతెనల నిర్మాణం ప్రారంభించినప్పటికీ పాలకులు ఒత్తిడి కారణంగా ఆపేశారు. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక వైపు చైనా తో గొడవ నడుస్తున్న టువంటి నేపథ్యంలోనే  వంతెనలో పూర్తిచేయడం చేసింది , ఎంతో సామర్థ్యం కలిగిన వంతెనను శరవేగంగా నిర్మిస్తూ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను కల్పించి ఉంటున్నారు సైనికులు,

మరింత సమాచారం తెలుసుకోండి: