అదేంటో చైనా విషయం చెప్పినప్పుడల్లా ఏది నమ్మాలో ఏది నమ్మకూడతో తెలియక ఒకటే డౌట్లు వచ్చేస్తున్నాయి. ఇపుడు కూడా అలాగే ఉంది. చైనా బలనాగలు సరిహద్దులు వదిలి ఒకటిన్నర కిలోమీటర్లు వెనక్కు వెళ్లాయని మీడియాలోనే వార్తలు వస్తున్నాయి అంతే తప్ప అధికారిక ప్రకటన అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ లేదు. దీంతో సరిహద్దుల్లో ఏం జరుగుతోంది అన్నది ఎవరికీ అంతుపట్టడంలేదు. భారతీయులకు చైనా ఈ విధంగా జారుకోవడం అన్నది అసలు ఇష్టంలేదు.

 

దాంతో చైనా చెప్పాపెట్టక  ఇంత చల్లగా వెళ్ళిపోయిందా అని సందేహలతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చైనా పని పట్టాలని భారత్ యువత ఓ వైపు ఊగిపోతోంది. మరో వైపు మాత్రం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారాయి అని మీడియా వార్తలు మాత్రమే వస్తున్నాయి.

 

దీనిమీద కేంద్రం ఇంతవరకూ ఒక్క అధికారిక ప్రకటన కూడా జారీ చేయలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇంత చల్లగా చైనా జారుకున్నపుడు ప్రధాని మోడీ లడక్ దాకా ఎందుకు హఠాత్తుగా వెళ్లారు. అక్కడ జవాన్లను ఉద్దేశించి ఎందుకు ఆవేశంగా మాట్లాడాల్సివచ్చింది అన్నది మరో ప్రశ్నగా ఉంది.

 

ఇక ప్రధాని చైనా అని కనీసం పేరు కూడా ప్రస్తావించకుండా తిడితే చైనాకు ఎలా అర్ధమవుతుంది అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉండగానే ప్రధాని ఇలా వెళ్ళి రాగానే చైనా బలగాలు ఉపసం హరించుకున్నాయని,వెనక్కు తగ్గాయని వార్తలు రావడం కూడా వ్యూహాత్మకమేనా అన్న మాట కూడా కాంగ్రెస్ నుంచి వినిపిస్తోంది.

 

ఇక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ చైనా విదేశాంగ మంత్రితో ఇలా మాట్లాడగానే అలా చైనా బలగాలు వెనక్కి మళ్ళితే ఇంత రచ్చ ఎందుకు జరుగుతుంది అన్నది కూడా ఇంకో డౌట్ వ్యక్తం చేస్తున్నారు. దీని మీద కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అయితే కేంద్ర సర్కార్  అన్ని సందేహాలు తీర్చాలని, అసలు చైనా బలగాలు వెనక్కు  వెళ్లాయా, వెళ్తే ఎంత దూరం వెళ్లాయి. భారత బలగాలు వెనక్కి మళ్ళితే ఎక్కడ దాకా మళ్లాయి అన్నవాటి మీద అధికారిక ప్రకటన చేయమంటున్నారు. ఇదంతా చూస్తూంటే సరిహద్దుల్లో చైనా ఏదో చేస్తోందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: