అప్పట్లో చంద్రబాబు హయాంలో అజేయ్ కల్లం రెడ్డి కీలక ప్రభుత్వ అధికారిగా రాణించడం జరిగింది. కాగా సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు వైయస్ జగన్ కి సన్నిహితుడిగా మారడం జరిగింది. కారణం చంద్రబాబు పాలనలో కీలక అధికారి గా ఉండటంతో లోగుట్టు మొత్తం తెలుసుకుని అవన్నీ ఎన్నికలకు ముందు చంద్రబాబుపై విమర్శలు రూపంలో అజేయ్ కల్లం బయటపెట్టడంతో జగన్ కి చేరువయ్యారు. కాగా జగన్ అధికారంలోకి వచ్చాక అజేయ్ కల్లం కి బహుమానంగా ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కొన్ని శాఖల్లో ఆర్థిక వ్యవహారాల్లో తల దూర్చినట్లు వైయస్ జగన్ కి ఫిర్యాదులు అందాయి అట.

 

దీంతో అంతర్లీనంగా ఒక ఐఏఎస్ అధికారి చేత విచారణ చేయించి మొత్తం విషయం తెలుసుకుని జగన్ ఇంకా పూర్తిగా తనచుట్టూ ఏపీ సచివాలయంలో భారీ మార్పులు చేయడానికి రెడీ అయ్యారట. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయం బాధ్యతలు నుంచి అజేయ్ కల్లాం, పీవీ రమేష్, జే. మురళి తప్పించిన సీఎం జగన్. ఆ ముగ్గురి బాధ్యతలను ప్రవీణ్ ప్రకాష్, సాల్మాన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాయింపు చేసారు.

 

అంతేకాకుండా ప్రవీణ్ ప్రకాష్ పరిధిలో… జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయ శాఖ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డ్…!, సాల్మన్ ఆరోఖ్య రాజ్ పరిధిలో… రవాణ, ఆర్ అండ్ బి, ఆర్టీసీ, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పీఆర్, సంక్షేమం, విద్యా, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ, గనులు, కార్మిక శాఖ…!, ఇక ధనుంజయ్ రెడ్డి పరిధిలో… జలవనరులు, అటవీ, మున్సిపల్, వ్యవసాయం, వైద్యారోగ్యం, ఇంధనం, టూరిజం, మార్కెటింగ్, ఆర్ధిక శాఖ కేటాయింపులు చేసినట్టు సమాచారం. ఒక్కసారిగా ఏపీ సచివాలయంలో జగన్ చుట్టూ భారీగా మార్పులు చోటుచేసుకోవడంతో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: