దాదాపు పది సంవత్సరాలు అనేక రాజకీయ ఎదురుదెబ్బలు తిని వైయస్ జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకోవడం జరిగింది. దీంతో జగన్ పోరాటానికి గాను 2019 ఎన్నికల్లో ప్రజలంతా జగన్ పై ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేసిన వాటిని పట్టించుకోకుండా భారీస్థాయిలో ముఖ్యమంత్రిని చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు తనకు ఇచ్చిన  బాధ్యతను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వైయస్ జగన్ కులాలకు మతాలకు అతీతంగా అదిరిపోయే పరిపాలన ఇస్తున్నారని చాలా సర్వేలలో మరియు ఏకంగా విపక్ష పార్టీల నాయకులూ అదే రీతిలో జాతీయస్థాయిలో నాయకులు మీడియాలు కూడా చెబుతున్నాయి.

IHG

ఈ విధంగా వైయస్ జగన్... పరిపాలన విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు మేలు చేసే ప్రతి చోట చెయ్యి వెనక్కి తీసుకోకుండా ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నారు. ప్రతి కులానికి కార్పొరేషన్ పేరిట నిధులు కేటాయిస్తూ అనేక మందికి కరోనా కష్టకాలంలో లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇకపోతే పై స్థాయిలో అంతా బాగున్నా జగన్ చుట్టూ ఉన్న అధికారులు కేవలం జగన్ ని సంతోషపరిచే విధంగా మాత్రమే పనులు చేస్తున్నారని ఆయా శాఖల్లో ఉన్న అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

IHG

ముఖ్యంగా మంత్రులు పనితీరు అసలు బాగోలేదని వివిధ శాఖలో ఎలాంటి ఫైలు కదలటం లేదని కామెంట్ చేస్తున్నారు. పరిపాలన పరంగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రజలకు మంచి చేయాలని చూస్తున్న మధ్యలో చాలావరకూ మంచి పనులు మంత్రులు వ్యవహరిస్తున్న తీరు వల్ల పెండింగ్ లో  పడిపోతున్నాయి అన్ని ప్రభుత్వ అధికారులు కామెంట్ చేస్తున్నారు. మంత్రులంతా కేవలం వైఎస్ జగన్ ని సంతోషపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు చెప్పుకొస్తున్నారు. దీంతో త్వరలో భారీ స్థాయిలో క్యాబినెట్ మార్పు జగన్ చేయనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: