నరసాపురం వైసీపీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాలలో గత కొన్ని రోజుల నుండి ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతోంది. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిపరులు అంటూ ఏకంగా అధిష్టానానికి వ్యతిరేకంగా... వైసిపి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే మీడియా ఛానల్స్ కి వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో వైసీపీ పార్టీ అధిష్టానం పెద్దలు రఘురామకృష్ణంరాజు కి షోకాజ్ నోటీసులు పంపించడం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా త్వరలోనే పార్టీకి సంబంధించి పార్లమెంట్ పరిధిలో రఘురామకృష్ణంరాజు కేటాయించిన పదవులు నుండి తొలగించాలని స్పీకర్ కి కూడా వైసీపీ పార్టీ పెద్దలు ఫిర్యాదు చేయడం జరిగింది.

 

ఈ విధంగా రఘురామకృష్ణంరాజు కి దెబ్బ మీద దెబ్బ కొడుతున్న వైసీపీ పార్టీ నేతలు తాజాగా ఆయన మీద కేసు పెట్టడానికి రెడీ అయ్యారు. పూర్తి విషయంలోకి వెళితే వైసీపీ పార్టీ మంత్రి రంగనాథ రాజు రఘురామకృష్ణంరాజు కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై రఘురామకృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని, పరువుకు భంగం కలిగించారని మంత్రి చెరుకువాడ రంగనాధరాజు పోలీసులకు పిర్యాదు చేశారు. పోడూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

 

దీంతో ఎమ్.పి పై చర్యలు తీసుకోవాలని రంగనాద రాజు కోరారు. కాగా దీనిపై రఘురాజు స్పందిస్తూ మంత్రి తనపై పోలీసులకు పిర్యాదుచేయడం తగదని అన్నారు. తన దిష్టిబొమ్మను దగ్దం చేస్తే పోలీసులు అప్పుడు ఎందుకు పట్టించుకోలేదని, కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పుడు తాను మంత్రి దిష్టి బొమ్మ దహనం చేశానని తప్పుడు పిర్యాదు చేశారని ఆరోపించారు. మొత్తం మీద రఘురామకృష్ణంరాజు పై వైసీపీ మంత్రి పోలీస్ కేసు పెట్టడంతో ఈ వార్త ఏపీలో సంచలనంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: