తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. కరోనా రోగులను కూడా కనీసం మనుషుల్లాగా చూడకుండా ఆసుపత్రి యాజమాన్యాలు వ్యవహరిస్తున్నట్లు సోషల్ మీడియాలో చాల  వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంకా క్వారంటైన్ లో ఉండే బాధితులకి కూడా సరైన సదుపాయం ప్రభుత్వం కల్పించడం లేదని చాలామంది కరోనా బాధితులు సెల్ఫీ వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉండటంతో చాలా మంది ప్రజలు ప్రభుత్వ అధికారులను సంప్రదించడానికి బదులు తెలంగాణ గవర్నర్ ని సంప్రదిస్తూ తమ బాధను వెళ్లబుచ్చుతున్నారు.

IHG

ఇలాంటి తరుణంలో తమిళనాడు గవర్నర్ తమిళిసై తానే రంగంలోకి దిగి ప్రైవేట్ ఆస్పత్రుల తో వర్చువల్ సమావేశం నిర్వహించారు. కరోనా ఐసోలేషన్‌ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ చికిత్స, పడకలు, పరీక్షలు, బిల్లులు, ప్రజల ఫిర్యాదులపై చర్చించారు. అసలు కరోనా రోగులను పట్టించుకోని విధంగా మంత్రులతో పాటు అధికారులు కూడా ఉండటంతో తెలంగాణ గవర్నర్ ప్రభుత్వంపై ఫుల్ సీరియస్ గా ఉన్నారట.

IHG

దీంతో తాజాగా జరిపిన సమావేశాల అనంతరం గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వం పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి  అరికట్టడానికి కేంద్రానికి లెటర్ రాయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా కరోనా కట్టడి సమీక్ష సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వ అధికారులను రాకపోవడంతో గవర్నర్ తమిళిసై ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. మరోపక్క కేసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు గవర్నర్ తమిళిసై ని  కలవలేదని టాక్ నడుస్తోంది. మొత్తంమీద ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో గవర్నర్ వర్సెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నట్టుగా వాతావరణం ఉందని వార్తలు బలంగా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: