సందర్భమో, యాదృచ్ఛికమో తెలీదు గానీ, ఏపీలో మళ్లీ కుల చిచ్చు చెలరేగింది. కాపు రిజర్వేషన్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేరుస్తాము అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఈ వ్యవహారం మొదలైంది. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో తమ మాట ఏమిటి అంటూ ముద్రగడ పద్మనాభం ఈ అంశాన్ని తెరమీదకు తీసుకు వచ్చారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారంలో తప్పించుకునే ధోరణిలో ఉండడంతో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. ఆ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఇక ఆ తరువాత ఇదే విషయమై వైసీపీని కూడా నిలదీయడంతో, 2019 ఎన్నికలకు ముందు ఆయన కాపులకు రిజర్వేషన్ అంశంపై తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రలో జగన్ ప్రకటించారు.

 

IHG

తాను రిజర్వేషన్స్ ఇవ్వలేను అని, ఇస్తాను అని మిమ్మల్ని చంద్రబాబు లా మోసం చేయలేను అంటూ జగన్ చెప్పసారు. అయినా ఆయన 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఈ వ్యవహారం అక్కడితో పక్కకు వెళ్లిపోయింది అనుకుంటున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం కాపు నేస్తం పేరుతో నిధులు విడుదల చేయడంతో, వైసీపీ వైపు కాపు సామాజిక వర్గం వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా జనసేన అధినేత పవన్ రంగంలోకి దిగారు. కాపులకు రిజర్వేషన్లు కావాలి కానీ, తాయిలాలు కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. దీనిపై వైసిపి కౌంటర్ ఇవ్వడం, గతంలో కాపు ఉద్యమ సమయంలో పవన్ ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ వైసీపీ నిలదీయడంతో పవన్ కాస్త వెనక్కి తగ్గారు.

 

ఇంత రాద్దాంతం జరుగుతున్నా, కాపు ఉద్యమనేత ముద్రగడ స్పందించడం లేదు ఏమిటి అనే ప్రశ్న కూడా తలెత్తడంతో ఈ వ్యవహారంలోకి ఆయన కూడా వచ్చారు. ఏపీ సీఎం జగన్ కు ముద్రగడ వినయంగా లేఖ రాసి, కాపు రిజర్వేషన్ కు మద్దతివ్వాలని కోరారు. వాస్తవంగా కాపులను బీసీల్లో చేరుస్తానని జగన్ చెప్పకపోయినా, ముద్రగడ లేఖ రాశారు. అందుకే ఎక్కడా విమర్శలు చేయకుండా, పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలంటే, మీకు ఓట్లు వేసి గెలిపించిన కాపులకు రిజర్వేషన్లు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

 

కులాలకు, మతాలకు అతీతంగా పార్టీ పెట్టానని చెప్పుకున్న పవన్ కూడా ఇప్పుడు కాపు సామాజిక వర్గం మద్దతు కూడగట్టుకునేందుకు పవన్ సిద్ధమైపోయారు. వారి సహకారంతో 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలనే తాపత్రయంతో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అటు పవన్ కు ఇటు ముద్రగడ కు చెక్ పెట్టి ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: