తిరుమల శ్రీవారి ఆలయంలో దశాబ్దాలపాటు కీలక పురోహితుడిగా  విధులు నిర్వహిస్తున్న సమయంలో చంద్రబాబు హయాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని అప్పట్లో రమణదీక్షితులు వార్తల్లో నిలవడం జరిగింది. ఆ టైంలో రమణదీక్షితుల కి అండగ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ సర్కార్ నిలవడం జరిగింది. కాగా జరిగిన ఎన్నికలలో జగన్ గెలవడంతో చంద్రబాబు టైం లో టీటీడీ ప్రధాన అర్చకులుగా, ఆగమ శాస్త్ర సలహాదారుగా పోయిన పదవిని తిరిగి రమణదీక్షితులకు వచ్చేలా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో రమణదీక్షితులు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సోషల్ మీడియాలో చేసిన కామెంట్ కి స్పందించిన విధానం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

పూర్తి విషయంలోకి వెళితే ఉత్తరాఖండ్ లో నాలుగు ధామాలు, మరో 51 ఆలయాలకు సంబంధించిన కేసుల్లో కోర్టు ఆర్డర్‌లు రిజర్వ్ చేసిందంటూ భాజపా సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కామెంట్ చేయడం జరిగింది . దీనికి రమణదీక్షితులు స్పందిస్తూ..” ఆల్ ది బెస్ట్ స్వామీ.. ఆ దేవుడు మీకు విజయాన్ని అందించేలా దీవించాలని కోరుకుంటున్నాను. మీ విజయం సనాతన ధర్మానికి విజయంగా భావిస్తున్నాం.. ఉత్తరాంఖండ్ తర్వాత తిరుమల ప్రభుత్వ చెర నుంచి విడుదల కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టారు.

 

దీంతో ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏంటి ఒక్క సారిగా రమణదీక్షితులు జగన్ సర్కార్ కి రివర్స్ అయిపోయారు అన్న టాక్ ఏపీ రాజకీయాల్లో వినబడుతుంది. ఇదిలా ఉండగా రమణదీక్షితులు టీటీడీ నిర్ణయాలకు స్వేచ్ఛ ఉండాలని ప్రభుత్వం కలుగజేసుకోకూడాదు అనే ఉద్దేశంతోనే కామెంట్ చేయడం జరిగిందని మరి కొంతమంది అంటున్నారు. చాలా వరకు టీటీడీ భూముల అమ్మకం మరియు లడ్డూ విక్రయాలు సహా పలు అంశాలపై ప్రభుత్వం జోక్యం చేసుకోవటంతోనే రమణదీక్షితులు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు అని చెప్పుకొస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: