దేశంలో కాన్పూన్ లో 8 మంది పోలీసులను హతమార్చిన తర్వాత తప్పించుకు తిరుగుతున్న దూబే.. ఫరీదాబాద్‌లోని బద్కల్ చౌక్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో దాక్కున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం దూబేను పట్టుకునేందుకు హోటల్‌పై దాడిచేసింది.  కానీ అప్పటికే అలర్ట్ అయిన దుబే అక్కడ నుంచి మాస్క్ ధరించి తప్పించుకున్నాడు.  మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ రికార్డు ఉన్న అత‌ని కోసం యూపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.  వికాశ్ దూబేపై ఉన్న రివార్డును 2.5 ల‌క్ష‌ల నుంచి 5 ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు ఆ రాష్ట్ర డీజీపీ వెల్ల‌డించిన విషయం తెలిసిందే.  

 

 

కాగా,  గ్యాంగ్‌స్టార్‌ వికాశ్‌ దూబే నోయిడాలో ప్రత్యక్షమయ్యాడు. బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆటోలో వెళ్తూ తనకు కన్పించాడని ఒక ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు.  బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆటోలో వెళ్తూ తనకు కన్పించాడని ఒక ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు. అయితే తాను   గ్రేటర్‌ నోయిడాలోని ఎక్కుర్తి గోల్చక్కర్‌ నుంచి నోయిడాలోని సెక్టార్‌ 71 వరకు తాను ఆటోలో వచ్చానని తనతో పాటు కూర్చున్న వ్యక్తి  వికాశ్ దుబే లా ఉన్నారని పోలీసులకు తెలిపాడు.  

 

నజాఫ్‌గఢ్‌ ప్రాంతంలో అతడు తిరుగుతున్నట్లు తెలియడంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లడపట్టారు. అయితే అతని ఆచూకీ లభించలేదు. హర్యానాలోని ఫరీదాబాద్‌ సెక్టార్‌ 87లోని తన బంధువుల ఇంట్లో దూబే ఆశ్రయం పొందాడని ఫరీదాబాద్‌ పోలీసులు ధృవీకరించాడు. కాన్పూర్‌లోని చౌబేపూర్‌ ప్రాంతంలో జూలై 3న ఎనిమిది మంది పోలీసులను కాల్చిచంపిన ఘటనలో దూబే ప్రధాన నిందితుడు.  కాన్పూర్ లో పోలీసులను అతి దారుణంగా  అత్యంత పాశవికంగా చంపండం పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: