దేశంలో కరోనా వైరస్ మొదలైనప్పటి నుండి తమ ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పాటుపడుతున్నారు పోలీసులు, వైద్యులు, పారిశుద్ద్య కార్మికులు.  ఈ మద్య వైద్యులు, పోలీసులకు కూడా కరోనా వైరస్ సోకుతుంది.. ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా ష్ట్రంలో కరోనాపై ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేస్తూ వైద్యులు, సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.  కరోనా కేసుల్లో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతున్నదని.. దీనికి కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు చేయలేమని అన్నారు.  దేశంలో కొవిడ్‌ మరణాల రేటు 3శాతం ఉంటే.. రాష్ట్రంలో రెండుశాతం కన్నా తక్కువగా ఉన్నదని చెప్పారు. 

 

లేనిపోని విషయాలు చర్చిస్తూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని.. ఇది ప్రజలల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన సమయం అని ఆయన అన్నారు. కరోనా సమస్యను సానుకూల దృక్పథంతో చూస్తున్నామని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విమర్శలు చేసుకోవడం కాకుండా విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. ప్రపంచంలో సంపన్న దేశాలే వైద్యసేవలు అందించలేని స్థితిలో ఉంటే.. కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని ప్రతిపక్షాలు నోరుపారేసుకుంటున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్రంలో కరోనా వైైరస్ అన్నటప్పటి నుంచి ప్రతిరోజూ మంత్రివర్గ, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారని.. అది ప్రజలు చూస్తూనే ఉన్నారని అన్నారు. 

 

కరోనాతో సహజీవనం చేస్తూనే ఆర్థికాభివృద్ధి సాధించాల్సి ఉన్నదని చెప్పా రు. ఇంకా ఎక్కువకాలం లాక్‌డౌన్‌ విధిస్తే ప్రజలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని.. ప్రతి ఒక్కరికీ జీవితంతోపాటు జీవనోపాధి కూడా ముఖ్యమేనన్నారు.   ప్రతి ఒక్కరూ కరోనాని జయించేందుకు తమను తాము కాపాడుకునే ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఇతరులను ఇబ్బందులు పెట్టకుండా బయటకు రావాలని సూచించారు.  కొవిడ్‌ వివరాలు దాస్తున్నామని కొందరు పిచ్చి కూతలు కూస్తున్నారని.. లెక్కలుదాస్తే మరణాల సంఖ్యను ఏవిధంగా దాస్తామో ఇలాంటివాళ్లు  ఆలోచించుకోవాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: